AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీకాంగ్రెస్ చ‌రిత్రలో కొత్త అధ్యాయం.. మునుపెన్నడూ లేని విధంగా అభిప్రాయ సేక‌ర‌ణ, ముగిసిన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక సంప్రదింపులు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సుధీర్ఘ రాజకీయ చ‌రిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త అంకం మొదలైంది. సరికొత్తగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం మొట్టమొదటిసారి...

టీకాంగ్రెస్ చ‌రిత్రలో కొత్త అధ్యాయం..  మునుపెన్నడూ లేని విధంగా అభిప్రాయ సేక‌ర‌ణ, ముగిసిన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక సంప్రదింపులు
Venkata Narayana
| Edited By: |

Updated on: Dec 12, 2020 | 5:51 PM

Share

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సుధీర్ఘ రాజకీయ చ‌రిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త అంకం మొదలైంది. సరికొత్తగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కోసం మొట్టమొదటిసారి సంప్రదింపులు జరిపారు. నాలుగురోజుల పాటు హైదరాబాద్ గాంధీభవన్ లో చేపట్టిన సంప్రదింపుల ప్రక్రియ శనివారం మధ్యాహ్నంతో ముగిసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త టీపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. నాలుగు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీలోని అన్ని విభాగాల నుంచి విడివిడిగా స‌మాచారాన్ని సేక‌రించారు రాష్ట్ర వ్యవ‌హారాల ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్‌. ఈ నేపథ్యంలో కొత్త టీపీసీసీ అధ్యక్షుడి ప్రకటన త్వరలోనే పార్టీ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us