అమెరికన్లను వణికిస్తున్న ఉల్లి.. ఎందుకో తెలుసా..

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే నానుడి తరతరాల నుంచి వస్తోంది. దీన్ని బట్టి ఉల్లి విశిష్టతలు వేరే చెప్పనక్కర్లేదు. ఏ కూర వండాలన్నా ఉల్లి కావాల్సిందే. వంటల్లో ఉల్లితో వచ్చే ఆ రుచే వేరంటారు వంటింటి

  • Sanjay Kasula
  • Publish Date - 3:36 pm, Fri, 7 August 20
అమెరికన్లను వణికిస్తున్న ఉల్లి.. ఎందుకో తెలుసా..

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే నానుడి తరతరాల నుంచి వస్తోంది. దీన్ని బట్టి ఉల్లి విశిష్టత వేరే చెప్పనక్కర్లేదు. ఏ కూర వండాలన్నా ఉల్లి కావాల్సిందే. వంటల్లో ఉల్లితో వచ్చే ఆ రుచే వేరంటారు వంటింటి మగువలు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఉల్లి పేరు చెబితేనే అగ్ర రాజ్యం భయపడుతోంది. ఎందుకంటే ప్రస్తుతం అమెరికాలో ఉల్లిపాయల వల్ల భయంకర మైన సాల్మోనెల్లా వ్యాధి దేశాన్ని చుట్టేస్తోంది. కరోనాను మించి దీని ప్రభావం ఉంటుందని అక్కడి వైద్యులు అంచనా వేస్తున్నారు.  సాల్మోనెల్లా ప్రధానంగా పొట్టలోని పేగులపై ప్రభావం చూపుతుంది.

ఈ వ్యాది గురించి అమెరికా అంటు వ్యాధుల నియంత్రణ సంస్ధ ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. అమెరికా, కెనడాల్లో ఇటీవల  ఫుడ్‌ పాయిజన్‌ కలిగించే సాల్మోనెల్లా బ్యాక్టీరియా వ్యాధికి చిక్కుతున్నవారి సంఖ్య అధికంగా ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు 34 రాష్ట్రాల్లో 400 మంది ఈ బాక్టీరియా బారిన పడినట్లు తెలుస్తోంది.  ఫలితంగా డయేరియా జ్వరం కడుపు నొప్పి వంటివి వస్తాయని అంచనా వేస్తున్నారు.

సాల్మొనెల్లా బ్యాక్టీరియా సోకిన వారిలో వెంటనే లక్షణాలు కనిపించవని అక్కడి వైద్యులు అంటున్నారు. 8 గంటల నుంచి 72 గంటల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయని… అవి కూడా 4 రోజుల నుంచి 7 రోజుల పాటూ ఉంటాయన్నారు. డయేరియా, జ్వరం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, తలనొప్పి వంటివి వస్తాయని పేర్కొన్నారు. అయితే దీనికి ఓ చిట్కా కూడా చెబతున్నారు. మంచి నీటిని ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడొచ్చని అంటున్నారు.