శ్రీరాంసాగర్‌కు వరద పోటు.. గేట్లు ఎత్తిన అధికారులు

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో బుధవారం ఉదయం నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఉదయం7 గంటలకు 25వేల క్యూసెక్కుల వరద రావడంతో....

శ్రీరాంసాగర్‌కు వరద పోటు.. గేట్లు ఎత్తిన అధికారులు

Updated on: Nov 04, 2020 | 8:07 PM

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో బుధవారం ఉదయం నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఉదయం7 గంటలకు 25వేల క్యూసెక్కుల వరద రావడంతో 8 వరద గేట్లను ఎత్తి దిగువ గోదావరిలోకి వదిలినట్లుగా డీఈ జగదీశ్‌ తెలిపారు. 9 గంటల నుంచి ఇన్‌ఫ్లో మరింత పెరగడంతో ఎస్కేప్‌ గేట్లను ఎత్తి గోదావరిలోకి 8 వేల క్యూసెక్కులను వదిలినట్లుగా పేర్కొన్నారు.

మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఇన్‌ఫ్లో క్రమంగా తగ్గుముఖం పట్టడంతో నాలుగు వరద గేట్ల ద్వారా 12,500 క్యూసెక్కులు…. ఎస్కేప్‌ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు మొత్తం 20,500 క్యూసెక్కుల వరద నీటివిడుదల కొనసాగుతుందని డీఈ పేర్కొన్నారు.

కాకతీయ కాలువకు 50 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ తాగునీటి అవసరాలకు 152 క్యూసెక్కులు, ఆవిరి, లీకేజీ రూపంలో 557 క్యూసెక్కులు పోతుందని డీఈ జగదీశ్ వెల్లడించారు.