AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇకపై మద్యం విక్రయాలకు..

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు రెండు నెలల పాటు మద్యం దొరక్క అల్లాడిపోయిన

మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇకపై మద్యం విక్రయాలకు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 02, 2020 | 5:19 PM

Share

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో దాదాపు రెండు నెలల పాటు మద్యం దొరక్క అల్లాడిపోయిన మందుబాబులకు ఒడిశా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటికే మద్యం హోం డెలివరీని ప్రారంభించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఒడిశా స్టేట్‌ బెవరేజస్‌ కార్పొరేషన్‌ (ఓఎస్‌బీసీ) ఏకంగా ఓ పోర్టల్‌నే ప్రారంభించింది.

కాగా.. లాక్‌డౌన్ నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మే 24న మద్యం హోం డెలివరీని ప్రారంభించింది. మందుబాబులు ఆయా దుకాణాల వద్ద ఏర్పాటు చేసిన నంబర్లకు ఫోన్‌ చేస్తేనే హోం డెలివరీ జరిగేది. ఇందుకోసం జోమాటో, స్విగ్గీ వంటి అగ్రిగేటర్ల సేవలను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంది. అయితే, తమ ఫోన్ నంబర్లు మందుబాబులకు చేరేందుకు రిటైలర్లు విస్తృతంగా ప్రచారం చేసేవారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి ఆదివారం వరకు సుమారు దాదాపు రెండున్నర లక్షల ఆర్డర్లు వచ్చాయి.

అయితే.. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం మద్యం డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని https://osbc.co.in/ అనే పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో ఆ జిల్లాలో ఉన్న రిటైలర్ల వివరాలు, బ్రాండ్లు, ఎంఆర్‌పీ తదితర వివరాలు ఉంటాయి. ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేయొచ్చని చెబుతున్నారు అధికారులు. అలా ఆర్డర్‌ చేయగానే ఎంఆర్పీతో పాటు, డెలివరీ ఛార్జీలతో కూడిన బిల్లు కూడా ఆన్‌లైన్‌లోనే పంపిస్తారట. త్వరలో యూపీఐ, నెట్‌బ్యాంకింగ్‌, ఫీడ్‌బ్యాక్‌ వంటి ఫీచర్లను కూడా తీసుకొస్తారట.

Also Read: కరోనా ట్రెండీ కలెక్షన్.. డిజైనర్ మాస్కులు.. న్యూ ఫ్యాషన్.. 

Follow Us
కృష్ణాష్టమి రోజు ఈ పూజలు చేయండి.. కన్నయ్య అనుగ్రహంతో ఇంట్లో..
కృష్ణాష్టమి రోజు ఈ పూజలు చేయండి.. కన్నయ్య అనుగ్రహంతో ఇంట్లో..
అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఇలా చేస్తే ఈ ప్రాబ్లమ్
అరటిపండు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఇలా చేస్తే ఈ ప్రాబ్లమ్
ఇంటర్ కూడా చదవలేదు.. మెడికల్ షాపులో పని..ఇప్పుడేమో జబర్దస్త్‌లో..
ఇంటర్ కూడా చదవలేదు.. మెడికల్ షాపులో పని..ఇప్పుడేమో జబర్దస్త్‌లో..
ఆ సినిమా దెబ్బకు రోడ్డున పడిపోయా..
ఆ సినిమా దెబ్బకు రోడ్డున పడిపోయా..
సెంచరీతో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
సెంచరీతో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
గోధుమ రంగు గుడ్లు అంటే దేశీయ గుడ్లేనా? ఎక్కువ ధర పెట్టేముందు..
గోధుమ రంగు గుడ్లు అంటే దేశీయ గుడ్లేనా? ఎక్కువ ధర పెట్టేముందు..
మొండి కొండా.. ఫైర్‌బ్రాండ్ ఫ్యామిలీ వివాదాలతో జర్నీ!
మొండి కొండా.. ఫైర్‌బ్రాండ్ ఫ్యామిలీ వివాదాలతో జర్నీ!
రాత్రిపూట పండ్లు తింటే బరువు పెరుగుతారా? అసలు నిజం ఇదే..
రాత్రిపూట పండ్లు తింటే బరువు పెరుగుతారా? అసలు నిజం ఇదే..
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
హైదరాబాద్‌ వాసులకు బిగ్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు
భోజనం చేసిన వెంటనే మళ్లీ తినాలనిపిస్తోందా? అసలు కారణం ఇదేనట
భోజనం చేసిన వెంటనే మళ్లీ తినాలనిపిస్తోందా? అసలు కారణం ఇదేనట