బెడిసి కొట్టిన ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్..నటిపై చీటింగ్ కేసు !
ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్ బెడిసి కొట్టింది. స్నేహితులగా పరిచయమైన ఇద్దరు చివరకు ఒకరిపై ఒకరు చీటింగ్ కేసులు పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే… ఒడియాకు చెందిన నటి చిన్మయ ప్రియదర్శినితో విశాఖకు చెందిన పద్మరాజు రవికుమార్ అనే యువకుడికి పరిచియం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహాంగా మారింది. ఈ క్రమంలోనే ప్రియదర్శిని వద్ద పెళ్లి ప్రస్థావన తీసుకువచ్చినట్లుగా రవికుమార్ వెల్లడించాడు. ఈ క్రమంలోనే తన దగ్గర నుంచి రూ.2 లక్షల నగదు, ఒక ల్యాప్‌టాప్, బంగారు గొలుసును ప్రియదర్శిని […]
ఫేస్‌బుక్ ఫ్రెండ్‌షిప్ బెడిసి కొట్టింది. స్నేహితులగా పరిచయమైన ఇద్దరు చివరకు ఒకరిపై ఒకరు చీటింగ్ కేసులు పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే… ఒడియాకు చెందిన నటి చిన్మయ ప్రియదర్శినితో విశాఖకు చెందిన పద్మరాజు రవికుమార్ అనే యువకుడికి పరిచియం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహాంగా మారింది. ఈ క్రమంలోనే ప్రియదర్శిని వద్ద పెళ్లి ప్రస్థావన తీసుకువచ్చినట్లుగా రవికుమార్ వెల్లడించాడు. ఈ క్రమంలోనే తన దగ్గర నుంచి రూ.2 లక్షల నగదు, ఒక ల్యాప్‌టాప్, బంగారు గొలుసును ప్రియదర్శిని తీసుకున్నట్లుగా చెబుతున్నాడు పద్మరాజు. ఆపై పెళ్లి గురించి మాట్లాడక పోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించానని రవికుమార్ చెప్పాడు.
ఇదిలా ఉంటే, తానేవరినీ మోసం చేయలేదని అంటోంది నటి చిన్మయి ప్రియదర్శిని.. పద్మరాజే తనను మోసం చేశాడని, తన దగ్గర డబ్బులు తీసుకుని చివరకు తననే బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపించింది. ఈ మేరకు భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె..పద్మరాజు రవికుమార్ ఫేస్‌బుక్‌లో పరిచయమైన మాట నిజమేనని అన్నారు. అయితే, అభిమానిని చెప్పి భువనేశ్వర్ వచ్చిన రవికి.. అతిథి మర్యాదలు కూడా చేసినట్టు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పడంతో తానే లక్షా 50 వేల రూపాయలు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించారు. అందులో రూ.50వేలు తిరిగి ఇచ్చాడని, మిగతా డబ్బు ఇవ్వలేదని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోగా తనపైనే రవికుమార్ ఆరోపణలు చేస్తున్నట్లు నటి చెప్పింది.
తనను పెళ్లి చేసుకుంటానని రవికుమార్ ప్రపోజ్ చేశాడని, దాన్ని తాను అంగీకరించలేదని, ఇద్దరం మంచి స్నేహితులుగానే ఉందామని చెప్పినట్లుగా చిన్మయి తెలిపింది. ఆ కక్షతోనే కొద్దిరోజులుగా రవికుమార్ తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని, తన పరువు తీసేందుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడని చిన్మయ ఆరోపించింది. అయితే తాను ప్రియదర్శిని వద్ద అప్పు తీసుకుంటున్నట్టు ఆమె చెప్పడం పచ్చి అబద్దం అంటున్నాడు పద్మ రాజు. తనతో రాజీ కుదుర్చుకునేందుకు ఓ స్నేహితుడి ద్వారా ప్రియదర్శిని కబురు కూడా పంపిందని చెప్పుకొచ్చాడు. దీంతో ఇరువురి ఫిర్యాదులు స్వీకరించారు పోలీసులు. ఇద్దరిలో అసలు చీటర్ ఎవరో తేల్చే పనిలో పడ్డారు.