AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం.. బంగారం కోసం ఓ దంపతులు ఎంతకు తెగించారంటే..

నమ్మినవారే ప్రాణం తీశారు. కేవలం రెండు తులాల బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దారుణం.. బంగారం కోసం ఓ దంపతులు ఎంతకు తెగించారంటే..
uppula Raju
|

Updated on: Dec 28, 2020 | 11:06 AM

Share

నమ్మినవారే ప్రాణం తీశారు. కేవలం రెండు తులాల బంగారం కోసం వృద్ధురాలిని హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. పోలీసుల కథనం ప్రకారం సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ కేంద్రంలోని కోటగల్లీలో దారుణం జరిగింది. నగలకోసం ఎల్లవ్వ అనే వృద్ధురాలిని చంపి ఇంట్లోనే పాతి పెట్టారు ఎల్లయ్య, నర్సవ్వ అనే దంపతులు. ఇందల్వాయి మండలo తిర్మనపల్లి గ్రామానికి చెందిన ఎల్లవ్వ గత పది రోజుల క్రితం మందుల కోసం వెళ్లి తిరిగి రాలేదు. అదే గ్రామానికి చెందిన ఎల్లయ్య, నరసవ్వ దంపతులు మాయమాటలు చెప్పి కోటగల్లీలోని ఓ ఇంట్లోకి తీసుకువచ్చి హత్య చేసి మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చి పెట్టారు.

రోజులు గడుస్తున్నా ఎల్లవ్వ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఇందల్వాయి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకు కోటగల్లీలోని ఓ ఇంట్లో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని వెలికితీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితులు వృద్ధురాలి మెడలోఉన్న బంగారు నగల కోసమే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. నగరం నడిబొడ్డున ఈ హత్య జరగడం స్థానికంగా కలకలం రేపుతుంది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నిందితుల్ని (నర్సయ్య&గంగవ్వ) అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Follow Us
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
ఈ నెలాఖరులోగా పదో ఫలితాలు 2026 విడుదల.. తాజా అప్ డేట్
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? తులం ధర ఎంత?
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!
CBSE రెండో విడత 2026 పరీక్షలు.. ఆ సబ్జెక్టుకే అత్యధిక దరఖాస్తులు!