AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీవీ9 కు షాకింగ్ విషయాలు చెప్పిన మహేష్ చెల్లెలు విమల

నున్న లో హత్యకు గురైన విజయవాడ పోలీస్ కమిషనరేట్‌ అటెండర్ మహేష్ హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహేష్ హత్యలో హరికృష్ణ పాత్రపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హరికృష్ణే మహేష్ ను‌ కార్లో నున్న తీసుకెళ్లాడని చెప్పిన మహేష్ సోదరి విమల.. హరికృష్ణతో పాటు మరో నలుగురు మహేష్ స్నేహితులు నున్న వెళ్లారని వెల్లడించింది. మహేష్ పక్కనున్న ఇద్దరు స్నేహితులకు గూగుల్ పే ద్వారా మద్యం తెమ్మని హరికృష్ణ పంపించాడని.. ఆ సమయంలో ఇద్దరు […]

టీవీ9 కు షాకింగ్ విషయాలు చెప్పిన మహేష్ చెల్లెలు విమల
Venkata Narayana
|

Updated on: Oct 12, 2020 | 2:31 PM

Share

నున్న లో హత్యకు గురైన విజయవాడ పోలీస్ కమిషనరేట్‌ అటెండర్ మహేష్ హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహేష్ హత్యలో హరికృష్ణ పాత్రపై బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హరికృష్ణే మహేష్ ను‌ కార్లో నున్న తీసుకెళ్లాడని చెప్పిన మహేష్ సోదరి విమల.. హరికృష్ణతో పాటు మరో నలుగురు మహేష్ స్నేహితులు నున్న వెళ్లారని వెల్లడించింది. మహేష్ పక్కనున్న ఇద్దరు స్నేహితులకు గూగుల్ పే ద్వారా మద్యం తెమ్మని హరికృష్ణ పంపించాడని.. ఆ సమయంలో ఇద్దరు దుండగులు రెక్కీ నిర్వహించి‌ మహేష్ పై కాల్పులు జరిపారని ఆమె చెప్పింది. కాల్పుల అనంతరం వెళ్లిపోయేందుకు ప్రయత్నం చేస్తున్న దుండగులకు హరికృష్ణ ‌కారు అప్పగించాడు.. ఆ కారు ను ముస్తాబాద్ వద్ద వదిలి దుండగులు పరారయ్యారని విమల పేర్కొంది.

మహేష్ మరో స్నేహితుడు దినేశ్ పై కూడా దుండగుల‌ు కాల్పులు జరిపారని విమల చెప్పింది. కాల్పులు జరపడానికి బైక్ పై వచ్చి కారు ఎందుకు వేసుకెళ్లారని ఆమె ప్రశ్నించింది. “మహేష్ కి వివాహం కాలేదు.. ఒక‌ వైద్యురాలిని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటున్నాడు. రెండు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాం. హత్యకు, ప్రేమకు సంబంధం లేదు. ఇదంతా పక్క ప్లాన్ తో హత్య చేశారు” అని మహేష్ సోదరి విమల టీవీ9కు తెలిపారు.

Follow Us
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో
సమోసా రాజధాని.. ఒక్కసారి తింటే మర్చిపోలేరు.. ఈ నగరంలో మాత్రమే!
సమోసా రాజధాని.. ఒక్కసారి తింటే మర్చిపోలేరు.. ఈ నగరంలో మాత్రమే!
'రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ మాదే'
'రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ మాదే'
పోటీలేదు.. తిరుగుండదు.! కేవలం రూ. 5 వేల పెట్టుబడితో
పోటీలేదు.. తిరుగుండదు.! కేవలం రూ. 5 వేల పెట్టుబడితో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్.
పిల్లల్లో తెలివితేటలు పెంచే  షుగర్ ఫ్రీ లడ్డూ.. ఒక్కటి తింటే చాలు
పిల్లల్లో తెలివితేటలు పెంచే  షుగర్ ఫ్రీ లడ్డూ.. ఒక్కటి తింటే చాలు
బ్రిటన్‌లో ఉచితంగా చదవాలనుకుంటున్నారా? UK స్కాలర్‌షిప్‌ల గైడ్..
బ్రిటన్‌లో ఉచితంగా చదవాలనుకుంటున్నారా? UK స్కాలర్‌షిప్‌ల గైడ్..