నేడు ఎన్టీఆర్‌ జయంతి

ఎన్టీఆర్.. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రజా నాయకుడు. సినీ రంగమే కాదు.. రాజకీయ నాయకుడిగా ప్రజల ఆదరభిమానాన్ని పొందిన నేత. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఇవాళ తెలుగు రాష్ట్రాలు ఆయన జయంతోత్సవాలు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజును పండుగలా జరుపుకుంటున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆయన విగ్రహాలను పూలతో […]

  • Tv9 Telugu
  • Publish Date - 6:55 am, Tue, 28 May 19
నేడు ఎన్టీఆర్‌ జయంతి

ఎన్టీఆర్.. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రజా నాయకుడు. సినీ రంగమే కాదు.. రాజకీయ నాయకుడిగా ప్రజల ఆదరభిమానాన్ని పొందిన నేత. ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఇవాళ తెలుగు రాష్ట్రాలు ఆయన జయంతోత్సవాలు నిర్వహిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజును పండుగలా జరుపుకుంటున్నారు.

ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా.. తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆయన విగ్రహాలను పూలతో అలంకరించారు. పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ గుంటూరు వెళ్లనున్నారు. రాష్ట్ర కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొని.. ఆయనకు నివాళి అర్పిస్తారు. ఆయనతో పాటు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్, మాజీ మంత్రి లోకేష్ కూడా ఇందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా నగరంలో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ర్యాలీ తీయనున్నారు. ఈ సారి మహానాడు నిర్వహణకు వీలు కానందు వల్ల గ్రామాలు, పట్టణాల్లో సమావేశాలు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.