AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్పొరేట్ వ్యవసాయమన్నది మా ప్లాన్ లోనే లేదు, రిలయెన్స్ క్లారిటీ, మా ఆస్తులను రక్షించాలంటూ కోర్టులో పిటిషన్

పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తమ జియో టవర్లను రైతులు నాశనం చేయడంపై ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

కార్పొరేట్ వ్యవసాయమన్నది మా ప్లాన్ లోనే లేదు, రిలయెన్స్ క్లారిటీ, మా ఆస్తులను రక్షించాలంటూ కోర్టులో పిటిషన్
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 04, 2021 | 1:29 PM

Share

పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తమ జియో టవర్లను రైతులు నాశనం చేయడంపై ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఇటీవల అన్నదాతలు ముఖ్యంగా పంజాబ్ లో 1500 కు పైగా రిలయన్స్ టవర్లకు తీవ్ర నష్టం కలిగించారు.కేబుల్ వైర్లను కట్ చేశారు. జియో టవర్లన్నీ వీరి ఆగ్రహానికి గురయ్యాయి. అయితే ఇలా ఆస్తులను నాశనం చేయడంవల్ల తమ సంస్థకు చెందిన ఎంతోమంది  ఉద్యోగుల జీవితాల్లో అభద్రత ఏర్పడిందని, వారు ఆందోళన చెందుతున్నారని ఈ సంస్థ పేర్కొంది. ఈ మేరకు పంజాబ్ హర్యానా హైకోర్టులో రిలయన్స్ సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. అసలు ఈ విధమైన దుశ్చర్యల్లో  సంఘ వ్యతిరేక శక్తులు పాల్గొంటున్నాయని, వారు అసలు అన్నదాతలేనా అన్న అనుమానం కలుగుతోందని పేర్కొంది.

రైతు చట్టాల కారణంగా ముఖ్యంగా ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు భావిస్తున్నారు. అందువల్లే తమ ఆగ్రహాన్ని జియో టవర్లపై చూపారు. అయితే తమ వ్యతిరేకులెవరో వీరిని రెచ్ఛగొడుతున్నట్టు కనిపిస్తోందని, ప్రభుత్వం తమ ఆస్తుల రక్షణకు చర్యలు తీసుకునేలా చూడాలని  రిలయన్స్ యాజమాన్యం కోర్టును కోరింది. నిజానికి కార్పొరేట్ వ్యవసాయంపై తమకు ఆసక్తి లేదని, పంజాబ్, లేదా హర్యానాలో భూములను స్వాధీనం చేసుకోవాలన్న యోచన తమకు లేదని స్పష్టం చేసింది. మన దేశానికి అన్నదాతలైన వీరిపట్ల తమకెంతో గౌరవం ఉందని, ఏమైనా తమ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని తమ టవర్లకు భద్రత ఉండేలా జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Also Read :వాళ్ళను కాదు, నన్ను పిలవండి, పంజాబ్ గవర్నర్ పై సీఎం అమరేందర్ సింగ్ ఆగ్రహం, ఇది బీజేపీ ఎత్తుగడేనని విమర్శ

Also Read :

సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
సింహ రాశి వార్షిక ఫలితాలు 2026: జూన్ వరకు వారికి తిరుగే ఉండదు..!
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
ఎంత తిన్నా వెంటనే ఆకలి అవుతుందా.. అసలు విషయం తెలిస్తే షాకే..
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2026: అదృష్టాల కోసం జూన్ వరకు ఆగాలి
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
న్యూఇయర్‌ బంపర్‌ ఆఫర్‌.. బేసిక్‌ ప్లాన్‌తో భారీ ప్రయోజనాలు!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
రహస్యంగా ఫోన్‌ వాడుతుందనీ.. భార్యను చంపి సినీ ఫక్కీలో నాటకం!
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటే చలి వేయదా..?
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
ఈ 8 ప్రముఖ దేవాలయాల్లో మాంసం, మందే నైవేద్యం
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
మిథున రాశి వార్షిక ఫలితాలు 2026: వారికి కొన్ని నిరాశలు, ఆశాభంగాలు
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
భారీ కుంభకోణం.. ఈ ప్రభుత్వరంగ బ్యాంకులో 2,434 కోట్ల మోసం..!
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి
'బలగం' తర్వాత నా మనసుకు నచ్చిన సినిమా ఇదే.. మంత్రి కోమటి రెడ్డి