ఢిల్లీలో తగ్గుతున్న మరణాల రేటు.. హోం ఐసోలేషన్ సేఫ్..

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు వారాలుగా మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.

ఢిల్లీలో తగ్గుతున్న మరణాల రేటు.. హోం ఐసోలేషన్ సేఫ్..
Follow us

| Edited By:

Updated on: Jul 11, 2020 | 10:04 PM

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో గత రెండు వారాలుగా మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ నెలలో ఇప్పటి వరకు హోం ఐసోలేషన్‌లో ఉన్న ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని ఢిల్లీ ప్రభుత్వం అధ్యయనంలో తేలింది. కోవిడ్ మరణాలకు అడ్డుకట్ట వేసేందుకు మున్ముందు ఎటువంటి చర్యలు తీసుకోవాలో తెలుసుకునేందుకు గత 15 రోజుల మరణాలపై అధ్యయనం చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం నగర ఆరోగ్య విభాగాన్ని ఆదేశించింది.

ఢిల్లీ ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం.. జూన్ 24 నుంచి ఈ నెల 8 మధ్య గత 15 రోజుల వ్యవధిలో ఢిల్లీలో 691 మంది మరణించినట్టు అధికారుల అధ్యయనంలో తేలింది. అంటే రోజుకు సగటున 46 మరణాలు సంభవించినట్టు నివేదిక పేర్కొంది. అయితే, గత కొన్ని రోజులుగా రోజువారీ మరణాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. జూన్ మధ్యలో అత్యధికంగా 101 మరణాలు నమోదు కాగా, గత పక్షం రోజుల్లో ఇది 46కు తగ్గింది.

దేశ రాజధానిలో మొత్తం మరణాల రేటు 3.64 శాతం నుంచి 3.02 శాతానికి తగ్గింది. అయితే, రోజు వారీ మరణాల రేటు 50 కంటే తక్కువగా నమోదవుతూ సగటు దాదాపు 2.5కు పడిపోయినట్టు నివేదిక వివరించింది. ఈ నెలలో హోం ఐసోలేషన్‌లో ఒక్క కరోనా రోగి కూడా మరణించలేదని నివేదిక వెల్లడించింది.

Also Read: అంబానీ, బఫెట్‌లను దాటేసి.. ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలాన్ మస్క్..