AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘సీబీఎస్‌సీ’ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..!!

No board exams in January or February: సీబీ‌ఎస్‌సీ విద్యార్థులకు ముఖ్య గమనిక. 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను వచ్చే ఏడాది...

'సీబీఎస్‌సీ' 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలు వాయిదా.. కేంద్రమంత్రి కీలక ప్రకటన..!!
Ravi Kiran
|

Updated on: Dec 22, 2020 | 6:37 PM

Share

No board exams in January or February: సీబీ‌ఎస్‌సీ విద్యార్థులకు ముఖ్య గమనిక. 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలను వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య కాలంలో నిర్వహించే అవకాశం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ తాజాగా ఉపాధ్యాయులతో జరిగిన వర్చువల్ సమావేశంలో వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలంగా లేవని.. బోర్డు ఎగ్జామ్స్‌పై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.

”పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయడం సాధ్యపడదు. ఒకవేళ అలా చేస్తే స్టూడెంట్స్ భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. జాతీయ పరీక్షలకు ప్రిపేర్ కావడం, ఉద్యోగాలు పొందటం కష్టతరం అవుతుంది. అందువల్ల పరీక్షలను రద్దు చేయడం జరగదు. కేవలం మరికొద్ది రోజుల పాటు వాయిదా వేస్తాం. ప్రస్తుతానికి జనవరి-ఫిబ్రవరి మధ్య 10, 12 తరగతుల బోర్డు ఎగ్జామ్స్ మాత్రం జరగవు. త్వరలోనే పరీక్షలు నిర్వహించే తేదీలను ప్రకటిస్తామని” కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు.

త్వరలోనే 6వ తరగతి విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ బేసిస్‌లో వృత్తి శిక్షణను ప్రవేశపెడతామని.. దానిని జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) 2020 పొందుపరిచామని ఆయన అన్నారు. కోవిడ్ కారణంగా వివిధ దేశాలు ఈ ఏడాది అకాడమిక్ ఇయర్‌ను రద్దు చేశాయి. కానీ మన దేశంలో ఏ ఒక్కవిద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదన్న ఉద్దేశంతో కరోనా కాలంలో కూడా ఉపాధ్యాయులందరూ శ్రమించారని ఆయన కొనియాడారు. అలాగే ప్రపంచంలోనే పాఠశాల స్థాయిలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ప్రవేశపెట్టబోయే మొట్టమొదటి దేశం ఇండియా అవుతుందని రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు.

అలాగే గతంలో జరిగిన వర్చువల్ సమావేశంలో సిలబస్‌ను కుదించే అవకాశం లేకపోలేదంటూ కేంద్రమంత్రి పేర్కొన్నారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌‌కు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని అన్నారు. మునపటి టైం టేబుల్‌ను పాటించాల్సిన అవసరం లేదని ఎగ్జామ్స్ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు. అలాగే జేఈఈ మెయిన్ ఎగ్జామ్స్ సంవత్సరంలో నాలుగుసార్లు జరుగుతాయని ప్రకటించారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 2021లో జరుగుతాయని తెలిపారు.