మహారాష్ట్రలో ‘ నితిన్ ‘ ఫార్ములా ! వర్కవుట్ అయ్యేనా ?

| Edited By: Srinu

Nov 07, 2019 | 1:22 PM

మహారాష్ట్ర లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. అధికార పంపిణీపై బీజేపీ-శివసేన మధ్య తలెత్తిన ప్రతిష్టంభనలో మార్పు లేదు. అసెంబ్లీ కాల పరిమితి ముగియడానికి ఇక ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. . 50 :50 ప్రాతిపదికపై చెరి సగం అధికారాన్ని పంచుకోవాలని శివసేన పట్టుబడుతూనే ఉంది. అయితే ఇందుకు బీజేపీ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీని పార్టీ అధిష్టానం రంగంలోకి దింపింది. ఆయన […]

మహారాష్ట్రలో  నితిన్  ఫార్ములా ! వర్కవుట్ అయ్యేనా ?
Follow us on

మహారాష్ట్ర లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. అధికార పంపిణీపై బీజేపీ-శివసేన మధ్య తలెత్తిన ప్రతిష్టంభనలో మార్పు లేదు. అసెంబ్లీ కాల పరిమితి ముగియడానికి ఇక ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. . 50 :50 ప్రాతిపదికపై చెరి సగం అధికారాన్ని పంచుకోవాలని శివసేన పట్టుబడుతూనే ఉంది. అయితే ఇందుకు బీజేపీ అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీని పార్టీ అధిష్టానం రంగంలోకి దింపింది. ఆయన తన అపాయింట్ మెంట్లన్నీ రద్దు చేసుకుని గురువారం నాగపూర్ బయలుదేరారు. ఆ నగరంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కలిసి తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. మరోవైపు ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీతో భేటీ అయ్యారు.
సేనతో ఏర్పడిన డెడ్ లాక్ ని [పరిష్కరించాలంటే..బీజేపీ ఓ కొత్త ఫార్ములాను రూపొందించడం విశేషం. . నితిన్ గడ్కరీ పేరును ‘ ముఖ్యమంత్రి అభ్యర్థి ‘ గా ‘ రాజీ ప్రతిపాదన ‘ చేస్తే ఎలా ఉంటుందని ఈ పార్టీ యోచిస్తోంది. అయితే ఇందుకు సేన ఒప్పుకుంటుందా అన్నది సందేహమే !. కాగా… నితిన్ కేవలం రెండు గంటల్లో సమస్యను పరిష్కరిస్తారని శివసేన నేత కిషోర్ తివారీ.. మోహన్ భగవత్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆ సామర్థ్యం ఆయనకు ఉందని అన్నారు.
మరోవైపు.. తమ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలను ‘డబ్బుతో కొనేందుకు ‘ బీజేపీ యత్నిస్తోందని శివసేన తన పత్రిక ‘ సామ్నా ‘ లో ఆరోపించింది. అధికారాన్ని చెరి సగం పంచుకోవాలని తాము ముందే ప్రతిపాదించామని, ఇందుకు మొదట ఒప్పుకున్న బీజేపీ ఇప్పుడు వెనకడుగు వేస్తోందని దుయ్యబట్టింది. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం ఉందంటూ బీజేపీ నాయకులు చేస్తున్న హెచ్ఛరికలకు బెదిరేది లేదని సేన పేర్కొంది. అటు-ఇక్కడ సేన-బీజేపీ కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ స్పష్టం చేసినప్పటికీ.. మారుతున్న పరిణామాలను ఆయన నిశితంగా గమనిస్తున్నారు. ఒకవేళ సేన-బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే.. సేన-కాంగ్రెస్ పార్టీలతో కలిసి సర్కార్ ఏర్పాటుకు తాము రెడీ అని ఆయన పరోక్షంగా సంకేతాలు పంపుతున్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి ఆయన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు కూడా..కానీ ఆయన ప్రతిపాదనను శివసేన తేలిగ్గా తీసుకోవడం గమనార్హం. సేన నేత సంజయ్ రౌత్ రెండు సార్లు పవార్ తో భేటీ అయినా,, ఈ పార్టీ అధిష్టానం దానిపై పెద్దగా స్పందించలేదు.