Nishabdham Trailer: ఆకట్టుకుంటున్న అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్…

|

Mar 06, 2020 | 2:09 PM

Nishabdham Trailer: ‘భాగమతి’ సినిమా తర్వాత హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘నిశ్శబ్దం’. తమిళ హీరో మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను కొద్దిసేపటి క్రితమే నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఇందులో అనుష్క మూగ పెయింటింగ్ ఆర్టిస్ట్ పాత్ర పోషిస్తోంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఓ క్రైమ్ మిస్టరీ చుట్టూ ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో ఈ మూవీను రూపొందించినట్లు తెలుస్తోంది. మాధవన్, అనుష్కలు వెకేషన్ టూర్‌కు […]

Nishabdham Trailer: ఆకట్టుకుంటున్న అనుష్క నిశ్శబ్దం ట్రైలర్...
Follow us on

Nishabdham Trailer: ‘భాగమతి’ సినిమా తర్వాత హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘నిశ్శబ్దం’. తమిళ హీరో మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను కొద్దిసేపటి క్రితమే నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఇందులో అనుష్క మూగ పెయింటింగ్ ఆర్టిస్ట్ పాత్ర పోషిస్తోంది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఓ క్రైమ్ మిస్టరీ చుట్టూ ఆద్యంతం ఆకట్టుకునే అంశాలతో ఈ మూవీను రూపొందించినట్లు తెలుస్తోంది. మాధవన్, అనుష్కలు వెకేషన్ టూర్‌కు వెళ్లగా అక్కడ వారికి కొన్ని భయంకర సంఘటనలు ఎదురవుతాయి. ఇక దీని వెనుక ఒక అజ్ఞాత వ్యక్తి ఉంటాడు.? అతడు ఎవరు.? అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నదన్నదే కథాంశం.! పూర్తి ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

పోలీస్‌గా హీరోయిన్ అంజలి నటించగా.. అనుష్క ఫ్రెండ్ పాత్రలో నటి షాలినీ పాండే కనిపించనుంది. హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కోన వెంకట్, టి జి విశ్వ ప్రసాద్ ఈ మూవీ నిర్మిస్తుండగా.. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

For More News:

కరోనా అలెర్ట్.. మాస్క్‌లతో జాగ్రత్త..

కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్‌కు కివీస్ క్రికెటర్లు డుమ్మా.?

ఒక్కొక్కరు ఆరుగురికి జన్మనివ్వండి.. మహిళలకు దేశాధ్యక్షుడి సూచన..!

నేనే దేవుడ్ని.. కరోనా వచ్చింది నా వల్లే.. క్షమించండి..

జగన్ సర్కార్‌లో సంచైతకు కీలక స్థానం…? ఇంతకీ ఎవరామె..?

హోమియోతో కరోనాకు చెక్.. క్యూ కట్టిన జనాలు

భారతీయులకు అభయం.. ఆ టాబ్లెట్‌తో కరోనా ఖేల్ ఖతం!