Pawan Kalyan: ‘కోహినూర్’ ఫైట్.. పవన్-క్రిష్ మూవీలో ఇదో హైలెట్ అట..!
క్రిష్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఓ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. పవన్ 27వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
క్రిష్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఓ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. పవన్ 27వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. చిత్రీకరణలో భాగంగా ఇప్పుడు ఫైట్ సీన్లను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. ‘కోహినూర్’ వజ్రం కోసం జరిగే పోరాటం నేపథ్యంలో ఈ ఫైట్ సీన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మాస్టర్లు ప్రత్యేక ఫైటింగ్ సీన్లను డిజైన్ చేశారట. అంతేకాదు సినిమా హైలెట్‌లలో ‘కోహినూర్’ ఫైట్ ఒకటిగా నిలుస్తుందని యూనిట్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
కాగా స్వాతంత్య్రం ముందు జరిగిన పీరియాడిక్ డ్రామాగా క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్.. రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే హాట్ యాంకర్ అనసూయ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. సినిమా మొత్తంలో ఈమె పాత్ర 30నిమిషాలు ఉండనుందని.. కీలక పాత్రల్లో అనసూయ కూడా ఒకరని టాక్. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఈ ఏడాది చివర్లో గానీ.. వచ్చే ఏడాది ప్రారంభంలో గానీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీతో పాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించిన పింక్ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా.. మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read This Story Also: చైతూ ‘లవ్ స్టోరీ’ వచ్చేది అప్పుడేనా..!