Coronavirus In India: హోమియోతో కరోనాకు చెక్.. క్యూ కట్టిన జనాలు

Coronavirus In India: భారత్‌లోనూ కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 30మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అటు వందల మంది అనుమానితులుగా కూడా ఉన్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా భయం పట్టుకుంది. తెలంగాణలో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా.. ఏపీలో ఇంతవరకు కరోనా కేసు నమోదు కాలేదు. అయితే తెలుగు రాష్ట్ర ప్రజల్లో మాత్రం కరోనా వైరస్ పేరే గట్టిగా వినిపిస్తోంది. ఆ వ్యాధి భయంతో దగ్గినా.. తుమ్మినా వాళ్లకు ఏదో […]

Coronavirus In India: హోమియోతో కరోనాకు చెక్.. క్యూ కట్టిన జనాలు
Follow us

|

Updated on: Mar 06, 2020 | 2:11 PM

Coronavirus In India: భారత్‌లోనూ కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటివరకు మొత్తం 30మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. అటు వందల మంది అనుమానితులుగా కూడా ఉన్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా భయం పట్టుకుంది. తెలంగాణలో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా.. ఏపీలో ఇంతవరకు కరోనా కేసు నమోదు కాలేదు. అయితే తెలుగు రాష్ట్ర ప్రజల్లో మాత్రం కరోనా వైరస్ పేరే గట్టిగా వినిపిస్తోంది. ఆ వ్యాధి భయంతో దగ్గినా.. తుమ్మినా వాళ్లకు ఏదో పెద్ద నేరంగా కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే నగరవాసులు హోమియో మందు కోసం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ ముందు బారులు తీరుతున్నారు. కరోనా వైరస్ రోగ నిరోధక ఔషధం పేరిట తెలంగాణ ఆయుష్ విభాగం అక్కడ ఓ స్టాల్‌ను ఏర్పాటు చేసి హోమియోపతి మందులను పంపిణీ చేస్తోంది. ఆర్సెనిక్ ఆల్బ్ 30పీ ఔషదం ద్వారా కరోనాను నియంత్రించవచ్చునని.. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ మందును పంపిణీ చేస్తున్నట్లు తెలంగాణ ఆయుష్ విభాగం అధికారులు తెలిపారు.

మంగళవారం సుమారుగా 3500 మందికి 11,500 డోసుల ఔషధాన్ని పంపిణీ చేశామని.. మున్ముందు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందజేస్తామని స్పష్టం చేశారు. అంతేకాక ఈ పిల్స్‌ను శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి.. స్వైన్ ఫ్లూ సోకినా వారికి కూడా ఇచ్చామని వైద్యశాఖ అధికారులు తెలియజేశారు. ఆర్సెనిక్ ఆల్బ్ 30పీ కరోనా వైరస్ కోసం తయారు చేసిందని కాదని.. ఇది ఏ రకమైన ఇన్‌ప్లూయెంజా దరికి చేరకుండా నియంత్రిస్తుందని చెప్పారు. అటు రోగనిరోధక శక్తిని సైతం పెంపొందిస్తుందన్నారు. కాగా, జలుబు-దగ్గు-జ్వరం లక్షణాలతో బాధపడుతున్నవారికి ఈ హోమియోపతి మందు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలంగాణ ఆయుష్ అడిషనల్ డైరెక్టర్ లింగరాజు వెల్లడించారు.

For More News: 

కరోనా అలెర్ట్.. మాస్క్‌లతో జాగ్రత్త..

కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్‌కు కివీస్ క్రికెటర్లు డుమ్మా.?

ఒక్కొక్కరు ఆరుగురికి జన్మనివ్వండి.. మహిళలకు దేశాధ్యక్షుడి సూచన..!

నేనే దేవుడ్ని.. కరోనా వచ్చింది నా వల్లే.. క్షమించండి..

జగన్ సర్కార్‌లో సంచైతకు కీలక స్థానం…? ఇంతకీ ఎవరామె..?

భారతీయులకు అభయం.. ఆ టాబ్లెట్‌తో కరోనా ఖేల్ ఖతం!

ఆకట్టుకుంటున్న అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్…