IPL 2020: కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్‌కు కివీస్ క్రికెటర్లు డుమ్మా.?

IPL 2020: ఇండియాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆడేందుకు తమ ఆటగాళ్లను భారత్‌కు పంపేందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్‌లో 30 మందికి కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. కాగా, ఐపీఎల్‌లో జిమ్మీ నిశమ్, లాకీ ఫెర్గుసన్, మిషెల్ మెక్‌క్లాగాన్, ట్రెంట్ బోల్ట్, కేన్ విలియమ్సన్, మిషెల్ శాంట్నర్‌లు ఆడనున్నారు. ఇక భారత్ వైరస్‌ను నివారించేందుకు తగిన చర్యలు తీసుకున్నాకే తమ ఆటగాళ్లను.. […]

IPL 2020: కరోనా ఎఫెక్ట్.. ఐపీఎల్‌కు కివీస్ క్రికెటర్లు డుమ్మా.?
Follow us

|

Updated on: Mar 06, 2020 | 2:13 PM

IPL 2020: ఇండియాలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌లో ఆడేందుకు తమ ఆటగాళ్లను భారత్‌కు పంపేందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు పునరాలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్‌లో 30 మందికి కరోనా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

కాగా, ఐపీఎల్‌లో జిమ్మీ నిశమ్, లాకీ ఫెర్గుసన్, మిషెల్ మెక్‌క్లాగాన్, ట్రెంట్ బోల్ట్, కేన్ విలియమ్సన్, మిషెల్ శాంట్నర్‌లు ఆడనున్నారు. ఇక భారత్ వైరస్‌ను నివారించేందుకు తగిన చర్యలు తీసుకున్నాకే తమ ఆటగాళ్లను.. అదే విధంగా మహిళా క్రికెటర్లను పంపిస్తామని ఎన్‌జెడ్‌సీ పీఆర్‌వో రిచర్డ్ బుక్ స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ఈ కరోనాపై పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే ఈ టూర్ గురించి ఆలోచిస్తామన్నారు.

ఈ నెల 29 నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే బీసీసీఐ కావాల్సిన ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. పలు ఫ్రాంచైజీ జట్లు కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఇక ఐపీఎల్‌లో క్రికెటర్లతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తారు. ఈ పరిణామం వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందుకే భారత క్రికెట్ బోర్డు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

For More News: 

కరోనా అలెర్ట్.. మాస్క్‌లతో జాగ్రత్త..

ఒక్కొక్కరు ఆరుగురికి జన్మనివ్వండి.. మహిళలకు దేశాధ్యక్షుడి సూచన..!

నేనే దేవుడ్ని.. కరోనా వచ్చింది నా వల్లే.. క్షమించండి..

జగన్ సర్కార్‌లో సంచైతకు కీలక స్థానం…? ఇంతకీ ఎవరామె..?

హోమియోతో కరోనాకు చెక్.. క్యూ కట్టిన జనాలు

భారతీయులకు అభయం.. ఆ టాబ్లెట్‌తో కరోనా ఖేల్ ఖతం!

ఆకట్టుకుంటున్న అనుష్క ‘నిశ్శబ్దం’ ట్రైలర్…