AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాసర అమ్మవారి వజ్రం మిస్..! నోరుమెదపని అధికారులు..?

ఆ మధ్య తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో మూడు బంగారు కిరీటాలు మాయమైన ఘటన మరువక ముందే మరొకటి చోటుచేసుకుంది. నిర్మల్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి మూల విరాట్ పైనున్న మకుటంలోని నవ వజ్రాల్లో ఒకటి కనిపించడం లేదు. ఈ వజ్రాలు పొదిగిన మకుటంతో రోజూ అమ్మవారిని అలంకరిస్తారు. కానీ.. కిరీటంలో ఒక వజ్రం కొన్ని రోజుల నుంచి కనిపించకుండా పోవడంతో.. భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూజారులు, అధికారులు మాత్రం ఈ […]

బాసర అమ్మవారి వజ్రం మిస్..! నోరుమెదపని అధికారులు..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 06, 2019 | 12:53 PM

Share

ఆ మధ్య తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయంలో మూడు బంగారు కిరీటాలు మాయమైన ఘటన మరువక ముందే మరొకటి చోటుచేసుకుంది.

నిర్మల్ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి మూల విరాట్ పైనున్న మకుటంలోని నవ వజ్రాల్లో ఒకటి కనిపించడం లేదు. ఈ వజ్రాలు పొదిగిన మకుటంతో రోజూ అమ్మవారిని అలంకరిస్తారు. కానీ.. కిరీటంలో ఒక వజ్రం కొన్ని రోజుల నుంచి కనిపించకుండా పోవడంతో.. భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పూజారులు, అధికారులు మాత్రం ఈ విషయాన్ని మరుగు పరిచినట్టు కనిపిస్తోంది. రోజు వారీ అభిషేకం చేస్తున్న సమయంలో ఎక్కడో వజ్రం పోయిందంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. తిథి, నక్షత్రం చూసి మళ్లీ ఈ వజ్రాన్ని అమరుస్తామని చెబుతున్నారు. అసంపూర్తిగా ఉన్న నగలనే మూల విరాట్టుకు అలంకరిస్తున్నారు.

అమ్మవారి ఆలయం ప్రతీసారి ఏదో ఒక వివాదంతో వార్తలకెక్కుతున్నా.. అధికారులు, పూజారులు మాత్రం నోరెత్తడంలేదు. వారిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.