బీహార్ లో రెండో దశ, 94 స్థానాలకు ఎన్నికలు, 10 రాష్ట్రాల్లో 54 సీట్లకు బైపోల్స్

బీహార్ లో రెండో దశలో భాగంగా మంగళవారం 94 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సెకండ్ పేజ్ లో 1464 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

బీహార్ లో రెండో దశ, 94 స్థానాలకు ఎన్నికలు, 10 రాష్ట్రాల్లో 54 సీట్లకు బైపోల్స్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 03, 2020 | 10:36 AM

బీహార్ లో రెండో దశలో భాగంగా మంగళవారం 94 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సెకండ్ పేజ్ లో 1464 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ముఖ్యంగా  ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, సీఎం నితీష్ కుమార్ మంత్రివర్గంలోని ఏడుగురు మంత్రులు, కాంగ్రెస్ నుంచి సినీ నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హా బరిలో ఉన్నారు. ఇక 10 రాష్ట్రాల్లో 54 స్థానాలకు ఉపఎన్నికలు కూడా  జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ లో 28, యూపీలో 7, ఒడిశా, నాగాలాండ్,కర్నాటక, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో 2 సీట్ల చొప్పున, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి బైపోల్స్ జరుగుతున్నాయి. ప్రధానంగా మధ్యప్రదేశ్ లో 28 సీట్లకు జరిగే ఉపఎన్నికలు  బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియాకు అగ్నిపరీక్షే.