అధికవడ్డీ ఆశచూపి ..నమ్మకంగా కుచ్చుటోపీ

హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం బట్టబయలైంది. పాతబస్తీలో ఘటన వెలుగుచూసింది. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బులు చెల్లిస్తామని చెప్పడంతో కొంతమంది అమాయకులు ఈ మోసగాళ్ల వలలో చిక్కుకున్నారు. చివరికి ఇదంతా మోసం అని తేలడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో రాబడి వస్తుందని ఆశించినవారి నెత్తిన కుచ్చుటోపీ పెట్టింది ఓ జంట. స్వయానా భార్యాభర్తలు ఈ మోసానికి పాల్పాడ్డారు. వీరిద్దరూ దాదాపు 9 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది. అధిక వడ్డీ వస్తుందని […]

అధికవడ్డీ ఆశచూపి ..నమ్మకంగా కుచ్చుటోపీ
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 25, 2019 | 7:31 PM

హైదరాబాద్‌లో మరో ఘరానా మోసం బట్టబయలైంది. పాతబస్తీలో ఘటన వెలుగుచూసింది. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు డబ్బులు చెల్లిస్తామని చెప్పడంతో కొంతమంది అమాయకులు ఈ మోసగాళ్ల వలలో చిక్కుకున్నారు. చివరికి ఇదంతా మోసం అని తేలడంతో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. పెట్టిన పెట్టుబడికి అధిక మొత్తంలో రాబడి వస్తుందని ఆశించినవారి నెత్తిన కుచ్చుటోపీ పెట్టింది ఓ జంట. స్వయానా భార్యాభర్తలు ఈ మోసానికి పాల్పాడ్డారు. వీరిద్దరూ దాదాపు 9 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది.

అధిక వడ్డీ వస్తుందని ఆశపడ్డ మధ్యతరగతి ప్రజలు ఒక్కొక్కరూ లక్ష రూపాయలనుంచి.. రూ.90 లక్షల వరకు కట్టారు. అయితే ఇది పచ్చిమోసం అని గ్రహించి ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించారు బాధితులు. హైదరాబాద్ పాతబస్తీ సైదాబాద్‌కు చెందిన భుశ్రా , సిరాజ్ దంపతులు గత కొంతకాలంగా ఈప్రాంతంలో నమ్మకంగా ఉంటూ జనాన్నితమ మాటలతో బురిడీ కొట్టించారు. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు సొమ్ము ఇస్తామంటూ ఆశచూపారు. దీంతో అధిక వడ్డీ వస్తుందని నమ్మకంగా చెప్పడంతో వీరి వద్ద సుమారు వందమంది వరకు పెట్టుబడి పెట్టినట్టుగా తెలుస్తోంది.

అయితే తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని అడిగిన వారిని బెదిరించి దాడులకు పాల్పడటంతో అసలు విషయం అర్ధమై.. వీరి దందా అంతా మోసమని గుర్తించి గురువారం సైబరాబాద్ పోలీసులను ఆశ్రయిచారు. అయితే మోసానికి పాల్పడ్డ భార్యభర్తలిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.