NIN Study: దేశంలో మూప్పై శాతం మంది చిన్నారుల్లో ఐరన్ లోపం.. వెలుగులోకి సంచలన విషయాలు…

మన దేశంలోని చిన్నారులు, కౌమరదశలో ఉన్న పిల్లలలో ఐరన్ లోపం అధికంగా ఉందని నేషనల్ ఇన్‏స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) వెల్లడించింది.

NIN Study: దేశంలో మూప్పై శాతం మంది చిన్నారుల్లో ఐరన్ లోపం.. వెలుగులోకి సంచలన విషయాలు...
Iron Deficiency
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 09, 2021 | 9:24 AM

మన దేశంలోని చిన్నారులు, కౌమరదశలో ఉన్న పిల్లలలో ఐరన్ లోపం అధికంగా ఉందని నేషనల్ ఇన్‏స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న చిన్నారుల్లో 30 నుంచి 32 శాతం మంది పిల్లలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారని పేర్కోంది. ఐదు నుంచి తొమ్మిదేళ్ల పిల్లలలో 11 నుంచి 15 శాతం మంది పిల్లలు మాత్రమే ఐరన్ లోపం ఉందని పరిశోధకులు తెలిపారు. దేశంలోని ప్రీమియర్ న్యూట్రిషన్ ఏజెన్సీ చేసిన పాన్ ఇండియా అధ్యయనంలో చాలా మంది చిన్నారులు ఐరన్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పటికీ.. వారి శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉందని.. దీంతో వారు రక్తహీనతకు గురయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

పట్టణాల్లో ఉండే పిల్లలో ఐరన్ శాతం ఎక్కువగా ఉందని.. కానీ అందుకు పూర్తి భిన్నంగా గ్రామీణ, పేద వర్గాలకు చెందిన పిల్లల్లో ఐరన్ శాతం తక్కువగా ఉందని తెలిపింది. పేద పిల్లలు, కౌమర దశలో ఉన్న చిన్నారులలో హిమోగ్లోబిన్ లో నిల్వ ఉండే ఐరన్… మిగత శరీర భాగాలను అందడం లేదని.. NIN పరిశోధన అధికారి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ భారతి కులకర్ణి అన్నారు. చిన్నారులకు కేవలం ఐరన్ ఉన్న ఆహారం మాత్రమే తినిపించాల్సిన అవసరం లేదని.. వారి శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి ఇతర పోషకాలు ఉన్న ఆహారం కూడా ఇవాలని ఆమె అన్నారు.

పేద వర్గాల్లో హిమోగ్లోబిన్ శాతం.. ఐరన్ లోపం ఉన్న పిల్లల్లో మాంసం, పండ్లు వంటి పోషక పదార్థాలను తక్కువగా తీసుకోవడం వలనే ఈ సమస్యలు ఎదురైనట్లు చెప్పారు. అలాగే పరిశుభ్రంగా లేని వాతావరణంలో నివసించే పిల్లల్లో అంటువ్యాధులు ఐరన్ లోపం, హిమోగ్లోబిన్ స్థాయిని తగ్గిస్తాయని ఎన్ఐఎన్ రూపొందించిన జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్యర్యంలో 2016-18 మధ్యకాలంలో సమగ్ర జాతీయ పౌష్టికాహార అధ్యయనం (సీఎన్‌ఎన్‌ఎస్)లో భాగంగా సేకరించిన రక్త నమూనాలను విశ్లేషించడం ద్వారా ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌, డాక్టర్‌ ఆర్‌.హేమలత తెలిపారు. ఇందులో భాగంగా 33వేల మంది చిన్నారులు, కౌమార దశ బాలల రక్త నమూనాలను పరీక్షించినట్లు పేర్కొన్నారు. ఈ నివేదిక ప్రకారం.. 30-32 శాతం ప్రీ స్కూల్‌ పిల్లలు, కౌమారదశ బాలికలలో ఐరన్‌ లోపం కనిపించింది. అయితే 5-9 సంవత్సరాలలోపు పిల్లల్లో ఇది తక్కువగా (11-15%)గా ఉంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేల ప్రకారం.. 40-50% మంది మహిళలలో, పిల్లల్లో ఈ సమస్య అధికంగా ఉందని ఆమె తెలిపారు. ఆహారం నాణ్యత, అంటువ్యాధులను నివారించాల్సిన అవసరం ఉందని పరిశోధకులు తెలిపారు.

Also Read: NTPC Recruitment 2021: ప్రభుత్వ రంగ సంస్థ NTPCలో 280 ఉద్యోగాలు.. ఆ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక.. దరఖాస్తులకు రేపే ఆఖరు..

సిక్స్‌ప్యాక్‌తో సర్ ప్రైజ్ ఇచ్చిన టాలీవుడ్ క్రేజీ హీరో..
సిక్స్‌ప్యాక్‌తో సర్ ప్రైజ్ ఇచ్చిన టాలీవుడ్ క్రేజీ హీరో..
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
అల్లు అర్జున్ అరెస్ట్‌పై ప్రశ్న.. పవన్ రియాక్షన్ ఇదే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
స్థిరంగానే బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో భారీగా ఉద్యోగాలు
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
369 పరుగులకు భారత్ ఆలౌట్.. డ్రా దిశగా ఎంసీజీ టెస్ట్?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
ఇది గ్లోబల్ స్టార్ రేంజ్ అంటే! దేశంలోనే అతిపెద్ద కటౌట్..ఎక్కడంటే?
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
డిగ్రీ సిలబస్‌ మారుతుందోచ్‌.. విద్యార్ధులు ఇది గుర్తుపెట్టుకోండి
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
గుడ్ న్యూస్.. రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
షుగర్ వ్యాధికి దివ్యౌషధం ఈ నీరు.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే..
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!