AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిమ్స్ దవఖానా సిబ్బందికి కరోనా..!

నిమ్స్ కు చెందిన నలుగురు డాక్టర్లు ముగ్గురు సిబ్బందికి కరోనా. కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్న నలుగురు డాక్టర్లు, ముగ్గురు సిబ్బంది కరోనా లక్షణాలు ఉండడంతో వైద్య పరీక్షలు చేసినట్లు నిమ్స్ సూపరింటెండెంట్ వెల్లడి.

నిమ్స్ దవఖానా సిబ్బందికి కరోనా..!
Balaraju Goud
| Edited By: |

Updated on: Jun 03, 2020 | 5:29 PM

Share

కరోనా కట్టడిలో ఫ్రంట్ వారియర్స్ కూడా ప్రభావితమవుతున్నారు. నిన్నటి వరకు ఉస్మానియా మెడికల్ కాలేజీకి చెందిన 12 మంది పీజీ విద్యార్థులకు కరోనా వైరస్ బారినపడగా తాజాగా నిమ్స్ కు చెందిన నలుగురు డాక్టర్లు ముగ్గురు సిబ్బందికి కరోనా సోకినట్లు తేలింది. కార్డియాలజీ విభాగంలో పనిచేస్తున్న నలుగురు డాక్టర్లు, ముగ్గురు సిబ్బంది కొవిడ్-19 లక్షణాలు ఉండడంతో వైద్య పరీక్షలు చేసినట్లు నిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ తెలిపారు. ఈ పరీక్షల్లో వారికి కరోనా సోకినట్లు నిర్ధారించామన్నారు. నలుగురు డాక్టర్లు నిమ్స్ కార్డియాలజీలో సూపర్ స్పెషాలిటీ కోర్స్ చేస్తున్నారని, ఇందులో భాగంగా పేషెంట్లకు ట్రీట్ మెంట్ చేస్తారన్నారు. క్యాత్ ల్యాబ్ లో పనిచేస్తున్న మరో ముగ్గురు సిబ్బంది కూడా కరోనా సోకినట్లు చెప్పారు. మరో వైపు 151మంది ఉస్మానియా మెడికల్ పీజీ విద్యార్ధులకు కరోనా టెస్ట్ లు చేయగా అందులో 12మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 129మంది టెస్ట్ ల రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. కరోనా సోకిన 12మంది పీజీ విద్యార్ధుల్లో పేట్ల బురుజు మోడరన్ గవర్నమెంట్ మెటర్నిటీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరుగురికి కరోనా సోకింది.

Follow Us
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..
రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటి
రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటి
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. మ్యాచుకు రోహిత్ దూరం
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. మ్యాచుకు రోహిత్ దూరం
కార్పొరేట్ కోర్టులో క్రీడా జోష్.. TV9 బ్యాడ్మింటన్ మహాసంగ్రామం
కార్పొరేట్ కోర్టులో క్రీడా జోష్.. TV9 బ్యాడ్మింటన్ మహాసంగ్రామం
డిగ్రీ అర్హతతో LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన
డిగ్రీ అర్హతతో LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన
ఆసియాలో రెండో వాడు.. బాబర్ ఆజం చారిత్రాత్మక రికార్డు
ఆసియాలో రెండో వాడు.. బాబర్ ఆజం చారిత్రాత్మక రికార్డు
ఏం లక్కురా బాబు.. ఈ రాశుల వారు త్వరలో కోటీశ్వరులు అవ్వడం ఖాయం!
ఏం లక్కురా బాబు.. ఈ రాశుల వారు త్వరలో కోటీశ్వరులు అవ్వడం ఖాయం!
నలుగురు చిన్నారుల ప్రాణం తీసిన నీటి గుంట!
నలుగురు చిన్నారుల ప్రాణం తీసిన నీటి గుంట!
మహేశ్ బాబు సోదరుడి కుమారుడి సినిమా.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?
మహేశ్ బాబు సోదరుడి కుమారుడి సినిమా.. ఈ హీరోయిన్ ఎవరో తెలుసా?