సిస్టర్స్ తో పార్టీ చేసుకున్న మెగా డాటర్ .. వైరల్ అవుతున్న సెల్ఫీ 

మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లిబాజాలు మోగబోతున్నాయి. మెగా డాటర్ నిహారిక త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది. ఐజీ కుమారుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చైతన్య దంతులూరిని ఈ అమ్మడు పెళ్లాడబోతుంది....

సిస్టర్స్ తో పార్టీ చేసుకున్న మెగా డాటర్ .. వైరల్ అవుతున్న సెల్ఫీ 
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 28, 2020 | 2:28 PM

మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లిబాజాలు మోగబోతున్నాయి. మెగా డాటర్ నిహారిక త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతుంది. ఐజీ కుమారుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చైతన్య దంతులూరిని ఈ అమ్మడు పెళ్లాడబోతుంది.ఇప్పటికే నిహారిక ఎంగేజ్మెంట్ జరగగా డిసెంబర్ 9న ఉదయ్ ప్యాలెస్ లో వివాహం జరగనుంది. ఈ పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను నిహారిక అన్న వరుణ్ తేజ్ స్వయంగా దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు.

తాజాగా నిహారిక తన సిస్టర్స్ అందరితో డిన్నర్ పార్టీని ఎంజాయ్ చేసింది. ఈ సందర్భంగా దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ పార్టీలో మెగాస్టార్ కుమార్తెలు సుశ్మిత- శ్రీజ తదితరులు ఉన్నారు. ఇటీవలే నిహారిక గోవాలో తన స్నేహితులతో కలిసి బ్యాచిలర్స్ పార్టీని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. డిసెంబర్ 9న జరగబోయే పెళ్ళికి మెగాహీరోలందరు దగ్గరుండి పనులు చూసుకోనున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా రెండు రోజుల ముందే హాజరవుతారని,పెళ్లి పనుల్ని స్వయంగా దగ్గరుండి చూసుకుంటారని అంటున్నారు.