ఏజ్ అనేది ఒక నంబర్ మాత్రమే, ఫోటోతోనే పాఠాలు చెబుతోన్న ఎవర్‌గ్రీన్ సిమ్రాన్
వారికి ఎంత ఏజ్ అయినా రానివ్వండి..కానీ మీ వయసు అయిపోతుంది అంటే మాత్రం హీరోయిన్లు ఒప్పుకోరు. ఓల్డ్ బ్యూటీ సిమ్రాన్...
వారికి ఎంత ఏజ్ అయినా రానివ్వండి..కానీ మీ వయసు అయిపోతుంది అంటే మాత్రం హీరోయిన్లు ఒప్పుకోరు. ఓల్డ్ బ్యూటీ సిమ్రాన్ కూడా ఇదే మాట రిపీట్ చేస్తున్నారు. ‘ఇప్పటికింకా నా వయసు నిండా నలభైనాలుగే’ అంటూ..పాత పాటను కొత్తగా పాడేస్తున్నారు. సిమ్రాన్ ట్విట్టర్‌ని లేటెస్ట్‌గా చూస్తే ఎవరైనా ఆమె థింకింగ్‌తో సింకవ్వాల్సిందే.
వయసు పాతికేళ్లు తగ్గినట్లుగా లేదూ..? అప్పటి సిమ్రాన్‌కీ ఇప్పటి సిమ్రాన్‌కి ఎంతో డిఫరెన్స్ ఉంది కదా.. అదీ మరి సిమ్రాన్ అంటే. 23 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో సినిమాలు విజయవంతం అవ్వడంలో సిమ్రాన్ తన పాత్ర పోషించారు. టాలీవుడ్ సీనియర్ హీరోల పక్కన ఒకప్పుడు బెస్ట్ ఆప్షన్‌గా రాణించారు. సినిమా నుంచి దూరంగా వెళ్లి చాలా గ్యాప్ ఇచ్చినా.. ఇంకా లైమ్‌లైట్‌లో వుండాలన్న ఆశ సిమ్రాన్‌లో కనిపిస్తోంది. అందుకే.. సగం ఏజ్ తగ్గించుకుని ఇలా అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో హాయ్ చెప్తారు.
Recipe to happiness: Dress up and wear a smile!!!#FridayVibes pic.twitter.com/4ZfbVb3vG7
— Simran (@SimranbaggaOffc) November 27, 2020
Also Read :
బ్రీత్ ఎనలైజర్ కాదు ఏకంగా రక్త పరీక్షే, తాగి బండి నడిపితే తోలు తీస్తాం : విజయవాడ ట్రాఫిక్ ఏడీసీపీ