Palvancha Suicide Case: పాల్వంచ ముగ్గురు ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. తెరపైకి రాజకీయ కోణం!

|

Jan 03, 2022 | 4:24 PM

భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలో జరిగిన ముగ్గురు కుటుంసభ్యల ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ మిస్టరీ ఆత్మహత్యలు పొలిటికల్‌ టర్న్‌ తీసుకున్నాయి.

Palvancha Suicide Case: పాల్వంచ ముగ్గురు ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. తెరపైకి రాజకీయ కోణం!
Family Suicide
Follow us on

Palvancha Family Members Suicide Case: భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచలో జరిగిన ముగ్గురు కుటుంసభ్యల ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ మిస్టరీ ఆత్మహత్యలు పొలిటికల్‌ టర్న్‌ తీసుకున్నాయి. ఆత్మహత్యలకు ముందు రామకృష్ణ రాసిన సూసైడ్‌ నోట్‌ ఇప్పుడు సంచలనం రేపుతోంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు…వనమా రాఘవేంద్ర రావు, మా అమ్మ సూర్యవతి, మా అక్క మాధవి..ఈ ముగ్గురు నా చావుకు కారణం అంటూ రామకృష్ణ సూసైడ్ నోట్ లో రాశాడు. గత కొంతకాలంగా కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు కారణంగా కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు రామకృష్ణ. నిన్న రాజమండ్రి నుంచి పాల్వంచకు వచ్చి ఈ రోజు తెల్లవారుజామున తనతో పాటు భార్య పిల్లలపై పెట్రోల్ పోసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణ జరిపాక అన్ని విషయాలు వెల్లడిస్తామన్నారు. దోషులు ఎంతటివారైనా శిక్షిస్తామని చెబుతున్నారు.

ఇదిలావుంటే, భద్రాది కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు ఒడిగట్టారు. ఇంట్లో తనతో పాటు భార్య పిల్లలపై పెట్రోల్ పోసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరిస్తోంది. ఈ ఘటనలో మరో బాలికకు తీవ్ర గాయాలు కావటంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, పాల్వంచకు చెందిన మండిగ నాగ రామకృష్ణ నవభారత్‌లో మీసేవా సెంటర్‌ నిర్వహిస్తున్నారు. ఇటీవల డాడీస్ రోడ్ అనే యాప్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. అయితే, కొంత కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లు స్థానికులు తెలిపారు.

సోమవారం ఉదయం 3 గంటల సమయంలో పాత పాల్వంచలోని జెండాల బజార్ లోని తన నివాసంలో పెద్ద శబ్దం రావటంతో స్థానికులు వచ్చి చూడగా మండిగ నాగ రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి, కుమార్తె సాహిత్య మృతి చెందారు. మరో కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Read Also… Vijayashanthi: టీఆర్ఎస్ ప్రజావ్యతిరేక విధానాలపై కేంద్రానికి రిపోర్ట్స్ వెళ్లాయి.. విజయశాంతి సంచలన వ్యాఖ్యలు