‘మనసు మమత’ శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్..

బుల్లితెర సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రావణి చావుకు సాయి అనే వ్యక్తి కారణమని దేవరాజ్ రెడ్డి వెల్లడించాడు.

  • Updated On - 6:09 pm, Wed, 9 September 20
'మనసు మమత' శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్..

Serial Actress Sravani: సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తన మృతికి సాయి అనే వ్యక్తి కారణమని శ్రావణి.. దేవరాజ్‌రెడ్డికు కాల్‌ చేసి చెప్పిన ఆడియో బయటకు వచ్చింది. శ్రావణి కుటుంబ సభ్యులు, సాయి అనే వ్యక్తి శ్రావణిని కొట్టి హింసించేవారని..వారి వేదింపులతో శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవ్‌రాజ్‌రెడ్డి చెప్పుకొచ్చాడు.

అలాగే సెప్టెంబర్‌ 7న తాను, శ్రావణి కలిసి డిన్నర్‌కు వెళ్లినట్లు…అక్కడికి సాయి అనే వ్యక్తి వచ్చి శ్రావణిపై చేయి చేసుకున్నాడుని దేవరాజ్‌రెడ్డి వివరించాడు. శ్రావణికి ఐదేళ్లుగా సాయితో పరిచయం ఉందని…తాను సంవత్సరం క్రితం శ్రావణికి పరిచయమయినట్లు తెలిపాడు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో తనపై తప్పుడు కేసులు పెట్టించారని దేవరాజ్ అన్నాడు.

కాగా, తెలుగు సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కలకలం రేపింది. గత ఎనిమిదేళ్ల నుంచి మౌనరాగం, మనసు మమత సీరియల్స్‌ శ్రావణి నటిస్తోంది. సాయి అనే వ్యక్తి వేధింపులతో ఎస్‌ఆర్‌ నగర్ పీఎస్‌ పరిధిలోని మధురనగర్‌లోని హెచ్ 56 బ్లాక్ సెకండ్ ఫ్లోర్ లో శ్రావణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

Also Read:

ఏపీ వెళ్లేవారికి గుడ్ న్యూస్.. రోడ్డెక్కిన బస్సులు.. వివరాలివే..

విజయవాడ, విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలోనే సిటీ సర్వీసులు.!

జగన్ సర్కార్ సంచలనం.. నగదు బదిలీ పధకానికి శ్రీకారం..!