AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రియాలిటీ షో విజేతకు అంతరిక్ష యాత్ర చేసే ఛాన్స్‌!

టీవీలలో బోలెడన్నీ రియాలటీ షోలు ప్రసారం అవుతున్నాయి.. వాటిని చూసేవాళ్లు కూడా ఎక్కువే.. వాటిల్లో పార్టిసిపేట్‌ చేసేవారికి కూడా బాగానే గిట్టుబాటు అవుతోంది.. ఇక విజేతకైతే భారీ నగదు బహుమతే ఉంటుంది..

రియాలిటీ షో విజేతకు అంతరిక్ష యాత్ర చేసే ఛాన్స్‌!
Balu
|

Updated on: Sep 21, 2020 | 6:31 PM

Share

టీవీలలో బోలెడన్నీ రియాలటీ షోలు ప్రసారం అవుతున్నాయి.. వాటిని చూసేవాళ్లు కూడా ఎక్కువే.. వాటిల్లో పార్టిసిపేట్‌ చేసేవారికి కూడా బాగానే గిట్టుబాటు అవుతోంది.. ఇక విజేతకైతే భారీ నగదు బహుమతే ఉంటుంది.. ఇవన్నీ కాదు కానీ.. రియాలిటీ షోలో గెలిచినవారిని అంతరిక్ష యాత్రకు పంపిస్తామంటోంది ఓ ప్రొడక్షన్‌ కంపెనీ.. స్పేస్‌ హీరో ఇన్‌కార్పొరేషన్‌ అనే అమెరికాకు చెందిన ఆ కంపెనీ త్వరలో స్పేస్‌ హీరో అన్న పేరుతో ఒక రియాలిటీ షోను స్టార్ట్‌ చేయబోతున్నది.. రియాలిటీ షో అనౌన్స్‌మెంట్‌ అయితే చేసింది కానీ ఆ ప్రొగ్రామ్‌ ఎలా ఉంటుందన్నది మాత్రం చెప్పలేదు.. అయితే 2023లో ప్రారంభమయ్యే ఈ షోలో గెలిచిన వారిని మాత్రం రోదసికి పంపిస్తామని చెబుతోంది.. అంతరిక్ష యాత్ర చేయాలన్న ఆసక్తి ఉన్నవారు అప్లయ్‌ చేసుకోవచ్చంటోంది.. సపోజ్‌ పర్‌ సపోజ్‌ వారు విజేతగా నిలిస్తే అంతరిక్షంలో ఉండగలరా అన్నది పరీక్షలతో తేలుస్తారట! అంటే ఫిజికల్‌గా మెంటల్‌గా ఎంత స్ట్రాంగ్‌ ఉన్నారన్నది కనిపెడతారన్నమాట. రియాలిటీ షోలో వారు కనబర్చిన పర్‌ఫార్మెన్స్‌, ఆర్డియన్స్‌ పోల్‌లో వచ్చిన ఓట్ల ఆధారంగా విజేతను డిసైడ్‌ చేస్తారు.. గెలిచినవారిని ఓ పది రోజుల పాటు అంతరిక్ష యాత్రకు పంపిస్తారు.. యాత్రలో భాగంగా రాకెట్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లి .. అక్కడ ఓ పది రోజులు గడిపేసి తిరిగి భూమి మీదకు వస్తారు. ఇందుకోసం ప్రైవేటు స్పేస్‌ మిషన్‌ సంస్థ యాక్సివోమ్‌ స్పేస్‌తో స్పేస్‌ హీరో ఒప్పందం కుదుర్చుకుంది. వీలైనంత తొందరలో నాసాతో సంప్రదింపులు జరుపుతారట! ఆ తర్వాతే రియాలిటీ షో పూర్తి వివరాలు చెబుతామంటోంది స్పేస్‌ హీరో ఇన్‌ కార్పొరేషన్‌ సంస్థ..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..