AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srilanka New Covid strain: శ్రీలంకలో కొత్త రకం కరోనా గుర్తింపు.. గాలిలో గంటసేపు ఉంటుందంటున్న శాస్త్రవేత్తలు.. ఆందోళనలో అధికారులు

కరోనా మహమ్మారి గాలి ద్వారానే చాలా తీవ్రంగా వ్యాపిస్తోందట. వస్తువులను ముట్టుకోవడం కంటే.. వైరస్ తో ఉన్న గాలిని పీల్చుకోవడం వల్లే పెద్ద మొత్తంలో వైరస్ కణాలు ఒకరి నుంచి ఒకరికి చేరుతున్నాయట

Srilanka New Covid strain: శ్రీలంకలో కొత్త రకం కరోనా గుర్తింపు.. గాలిలో గంటసేపు ఉంటుందంటున్న శాస్త్రవేత్తలు.. ఆందోళనలో అధికారులు
Sri Lanka Can Remain Airborne Virus
Balaraju Goud
|

Updated on: Apr 25, 2021 | 11:43 AM

Share

Srilanka New Covid strain: కరోనా మహమ్మారి గాలి ద్వారానే చాలా తీవ్రంగా వ్యాపిస్తోందట. వస్తువులను ముట్టుకోవడం కంటే.. వైరస్ తో ఉన్న గాలిని పీల్చుకోవడం వల్లే పెద్ద మొత్తంలో వైరస్ కణాలు ఒకరి నుంచి ఒకరికి చేరుతున్నాయట. అందుకే.. కరోనాను గాలి ద్వారా వ్యాపించే (ఎయిర్ బోర్న్) వైరస్ గా ప్రకటించారు సైంటిస్టులు తేల్చిచెప్తున్నారు. గాలి ద్వారానే కరోనా తీవ్రంగా వ్యాపిస్తోందని చెప్పేందుకు గట్టి ఆధారాలు కూడా ఉన్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. వెంటనే గాలి ద్వారా కరోనా వ్యాప్తిని అడ్డుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో), ఇతర సంస్థలకు వారు సూచనలు చేశారు.

గాలి ద్వారా వ్యాపించే కొత్త రకం కరోనా వైరస్‌ను తమ దేశంలో గుర్తించినట్లు శ్రీలంక అధికారులు తెలిపారు. ఇక్కడ ఇప్పటికే కనుగొన్న రకాలతో పోలిస్తే చాలా ఉద్ధృతంగా వేగంగా ఇది విస్తరిస్తోందని పేర్కొన్నారు. ఇది గాల్లో దాదాపు గంటసేపు మనుగడ సాగించగలదని శ్రీ జయవర్ధనపుర విశ్వవిద్యాలయంలో ఇమ్యునాలజీ విభాగం అధిపతి నీలికా మలవిగే చెప్పారు. ఇటీవల దేశంలో ఎక్కువ యువత కొవిడ్‌-19 బారినపడుతోందని ఆయన వివరించారు. దీనికి ఈ కొత్త రకమే కారణం కావచ్చంటున్నారు. ఇది మూడో ఉద్ధృతికి దారితీయవచ్చని ప్రజారోగ్య నిపుణుడు ఉపుల్‌ రోహానా చెప్పారు.

“కరోనావైరస్ ఈ వేరియంట్ ద్వీపంలో ఇప్పటివరకు కనుగొనబడిన దానికంటే చాలా ఎక్కువగా వేగంగా సంక్రమిస్తుంద శ్రీలంక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త రకం వైరస్ గాలిలో ఉంటుంది. బిందువులు దాదాపు గంటసేపు గాలిలో ఉంటాయి” అని మాలావిజ్ చెప్పారు. గత వారం నూతన సంవత్సర వేడుకల తరువాత ఎక్కువ మంది యువకులు వ్యాధి బారిన పడటంతో కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు. “రాబోయే రెండు ఇంక్యుబేషన్ వ్యవధిలో, ఈ వ్యాధి మూడవ తరంగానికి చేరుకుంటుంది” అని పబ్లిక్ హెల్త్ ఇన్స్పెక్టర్లకు చెందిన ఉపుల్ రోహనా తెలిపారు. రాబోయే 2-3 వారాలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

దీంతో శ్రీలంక కోవిడ్ నివారణ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త నిబంధనలు మే 31 వరకు అమలులో ఉంటాయని వెల్లడించింది. అన్ని రకాల వినోద కార్యక్రమానలు నిషేధించింది. ఏప్రిల్ నూతన సంవత్సరానికి ముందు దేశవ్యాప్తంగా 150 కేసులు నమోదు కాదా, ఇప్పుడు రోజుకు 600 కు పైగా కేసులకు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. శ్రీలంక ఆరోగ్య సంరక్షణ సామర్థ్యం కూడా లేకుండా పోతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో రీసెర్చ్ లో భాగంగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ట్రిష్ గ్రీన్ హాల్గ్ ఆధ్వర్యంలోని ఆరుగురు సైంటిస్టుల బృందం వైరస్ వ్యాప్తికి సంబంధించి పబ్లిష్ ​అయిన అనేక ఆర్టికల్స్‌ను రివ్యూ చేశారు. గాలిలో ఫ్లూయిడ్స్ ఎలా ప్రయాణిస్తాయి? లైవ్ వైరస్ తీరు ఎలా ఉంటుంది? అన్నవి స్టడీ చేసిన వీరు.. గాలి ద్వారా కరోనా వ్యాప్తికి సంబంధించి ప్రధానంగా10 అంశాలను తమ స్టడీ రిపోర్టులో పేర్కొన్నారు.

‘అమెరికాలోని స్కాగిట్ కౌంటీలో ఒకే వ్యక్తి నుంచి 53 మందికి కరోనా వ్యాపించింది. కానీ మొదట వైరస్ సోకిన వ్యక్తి నుంచి ఇతరులకు క్లోజ్ కాంటాక్ట్ లేదు. అతను ఉపయోగించిన వస్తువులను కూడా ఇతరులు వాడలేదు. కానీ అతను ఉన్న పరిసరాల్లోనే ఉండటం వల్ల ఇతరులకు వైరస్ అంటుకున్నది. ఈ సంఘటనలోని అన్ని విషయాలను పరిశీలిస్తే.. కచ్చితంగా గాలి ద్వారానే ఇతరులకు వైరస్ వ్యాపించినట్లు స్పష్టం అవుతోంది. ఎయిర్ బోర్న్ ట్రాన్స్ మిషన్ కు ఈ సంఘటన గట్టి ఆధారం” అని సైంటిస్టులు చెప్పారు. అలాగే బయటి ప్రదేశాల కంటే ఇండోర్స్ లో, ముఖ్యంగా వెంటిలేషన్ సరిగ్గా లేని రూంలలో వైరస్ వ్యాప్తి చాలా రెట్లు ఎక్కువగా ఉందనేందుకు కూడా చాలా ఎవిడెన్స్ లు ఉన్నాయన్నారు. ఫంక్షన్లు, పార్టీలు, ఇతర కార్యక్రమాల్లోనూ సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లుగా బయటపడిన అనేక సంఘటనల్లో కూడా కరోనా గాలి నుంచే వ్యాపించిందని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని సైంటిస్టులు తేల్చిచెప్పారు.

గాలిలోని కరోనా దగ్గరలో ఉన్నవారికే కాకుండా దూరంగా ఉన్నవారికి కూడా సోకే చాన్స్ ఉందని శాస్త్రవేత్తల అధ్యయనంలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియా ఏరోసాల్ సైంటిస్ట్ కిమబర్లీ ప్రాథర్ చెప్పారు. ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘటనలు జరిగాయని, అందుకే కరోనాను ఎయిర్ బోర్న్ వైరస్ గా గుర్తించాల్సి ఉందన్నారు. దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఎయిర్ బోర్న్ వైరస్ గా అధికారికంగా గుర్తించి, తగిన నివారణ చర్యలు తీసుకోకుంటే విపత్తు మరింత తీవ్రం కావచ్చని పేర్కొన్నారు.

Read Also….  మీకు కరోనా పాజిటివ్ వస్తే.? ఏం చేయాలి.? ఏం చేయకూడదు.? తెలుసుకోండి!