AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేపాల్ సంక్షోభ పరిష్కారానికి ఎన్నికలు జరగాలి, ఇండియా పరోక్ష సూచన, చైనాకు చెక్ పెట్టేందుకేనా ? పీఎం ఓలి ఎటువైపు ?

నేపాల్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అక్కడ ఎన్నికలు జరగాలని ఇండియా సూచించింది.

నేపాల్ సంక్షోభ పరిష్కారానికి ఎన్నికలు జరగాలి, ఇండియా పరోక్ష సూచన, చైనాకు చెక్ పెట్టేందుకేనా ? పీఎం ఓలి ఎటువైపు ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 02, 2021 | 3:17 PM

Share

నేపాల్ లో తలెత్తిన రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అక్కడ ఎన్నికలు జరగాలని ఇండియా సూచించింది. అక్కడి తాజా పరిస్థితిలో జోక్యం చేసుకోవడానికి ఇండియాకు ‘అర్హత’ అంటూ లేకున్నా ఆ దేశంలో ప్రజాస్వామ్యం నెలకొనాలని మాత్రం భావిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ దిశగా తన ‘ మిషన్’ ని నిర్వర్తించే విషయంలో చైనా విఫలం చెందిందని ఈ వర్గాలు భావిస్తున్నాయి. కానీ ఆ దేశ రాజకీయాల్లో డ్రాగన్ కంట్రీ జోక్యం గత కొన్నేళ్లుగా పెరుగుతున్న అంశాన్ని ఇండియా గమనిస్తోంది., నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఇటీవల పార్లమెంటును రద్దు చేశారు. అయితే తాజా సంక్షోభాన్నిపరిష్కరించేందుకు  ఆయన చైనా తోడ్పాటును  తీసుకుంటారా లేక  లేక ఇండియా సహకారంతోనా అన్నది తేలడంలేదు. హిందూ కార్డ్ ను, జాతీయ వాదాన్ని కూడా ఆయన తన చతురతకు వినియోగించవచ్చు.

కానీ చైనా ప్రభావం మాత్రం నేపాల్ మీద విపరీతంగా ఉందనడంలో సందేహం లేదు. అక్కడి పాలక ఎన్సీపీలో చీలిక అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. ఎన్సీపీ ఎలెక్షన్ గుర్తును ఎవరికి కేటాయించాలన్న దానిపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది జటిల సమస్యే ! అలాగే పార్లమెంటు రద్దు అంశాన్ని కూడా ఈ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించాల్సి ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి వచ్ఛే మే నెలవరకు, చివరకు నవంబరు వరకు కూడా కొనసాగేలా పీఎం ఓలి చూసే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. అప్పటికి ఎలాగు ఎన్నికలు వచ్చ్చేస్తాయి. తాత్కాలిక ప్రధానిగా తటస్థ వ్యక్తిని ఎంపిక చేయాల్సి వస్తే సుప్రీంకోర్టు ప్రధాన  న్యాయమూర్తి ఉండనే ఉన్నారు. కానీ అప్పుడు, రాజ్యాంగ, లేదా రాజకీయ సవాళ్లు కూడా ఉంటాయి. ఈ సమయంలో ఇండియా  కీలక పాత్ర ఏమై నా వహించే సూచనలు ఉన్నాయా అని విశ్లేషకులు తర్జనభర్జన పడుతున్నారు.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్