కరోనా ఎఫెక్ట్‌… చిన్నబోయిన ఎవరెస్ట్‌!

| Edited By:

Mar 13, 2020 | 10:38 PM

కరోనా మహమ్మారి ప్రస్తుతం 134 దేశాలకు విస్తరించింది. కరోనా వైరస్‌ ప్రభావం ఇప్పుడు ఎవరెస్టు పర్వతాన్ని తాకింది. ఎవరెస్టు అధిరోహణ అనుమతులను నిలిపివేస్తూ తాజాగా నేపాల్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టిబెట్‌

కరోనా ఎఫెక్ట్‌... చిన్నబోయిన ఎవరెస్ట్‌!
Follow us on

కరోనా మహమ్మారి ప్రస్తుతం 134 దేశాలకు విస్తరించింది. కరోనా వైరస్‌ ప్రభావం ఇప్పుడు ఎవరెస్టు పర్వతాన్ని తాకింది. ఎవరెస్టు అధిరోహణ అనుమతులను నిలిపివేస్తూ తాజాగా నేపాల్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టిబెట్‌ నుంచి ఈ శిఖరాన్ని అధిరోహించటానికి ఉన్న మార్గాన్ని మూసి వేస్తున్నట్లు చైనా ప్రకటించింది.

కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో.. ఎవరెస్టుతో సహా తమ దేశంలోని అన్ని పర్వతాల అధిరోహణ అనుమతులు, పర్యాటక వీసాలనూ నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులపై వచ్చే నెలలో సమీక్ష నిర్వహించి అనుమతులపై పునరాలోచిస్తామని నేపాల్‌ పర్యాటక శాఖ వెల్లడించింది. ఎవరెస్టు పర్వతారోహణ వల్ల ఆ దేశానికి ఏటా అధిక మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. ప్రస్తుత సీజన్‌ సమయంలో పర్యాటకుల సందడి అధికంగా ఉంటుంది. అయితే కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న కారణంగా అనుమతులు నిలిపి వేయడంతో ఆదాయానికి గండిపడినట్లే.