చైనా చెలిమితో నేపాల్ ఓవరాక్షన్..తాజాగా భారత్‌తో మరో వివాదం..!
ఇన్నాళ్లు మనతో మిత్రదేశంగా మెలిగిన నేపాల్..ఇప్పుడు చైనా అండతో ఇండియాతో కయ్యానికి కాలు దువ్వతోంది. ఇటీవల భారత తమవిగా చెప్తోన్న భూభాగాలను కూడా తమవే అంటూ నూతన మ్యాప్ రీలీజ్ చేసిన ఆ దేశం.. తాజాగా మరో వివాదం రాజుకునేలా చేసింది.

ఇన్నాళ్లు మనతో మిత్రదేశంగా మెలిగిన నేపాల్..ఇప్పుడు చైనా అండతో ఇండియాతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇటీవల భారత తమవిగా చెప్తోన్న భూభాగాలను కూడా తమవే అంటూ నూతన మ్యాప్ రీలీజ్ చేసిన ఆ దేశం.. తాజాగా మరో వివాదం రాజుకునేలా చేసింది. బిహార్‌లోని పంతోక గ్రామానికి దగ్గర్లో ఉన్న బార్డర్ వద్ద ఓ వాచ్ టవర్‌ను నిర్మించింది నేపాల్. ఇది నేపాల్ దళాల గస్తీకి ఉపయోగపడనుంది. అయితే ఈ వాచ్ టవర్ వివాదానికి చైనా పరోక్ష కారణమని సమాచారం.
వాచ్ టవర్‌ను ఏర్పాటు చేయడానికి నేపాల్‌పై చైనా ఒత్తిడి పెంచినట్టు తెలుస్తోంది. భారత్ వ్యవహారాలపై ఫోకస్ పెట్టడానికే నేపాల్‌ను చైనా ఈ విధంగా ప్రోత్సహించి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. పోల్ నెం 392/13- స్తంభం నెం 392/18 మధ్య ఈ టవర్‌ను నిర్మించింది నేపాల్. అయితే బార్డర్ గుర్తింపు కోసం ఏర్పాటు చేసిన రెండు స్తంభాల మధ్య ఉండాల్సిన ఓ చిన్న స్తంభం కనపడటం లేదని సశస్త్ర సీమా బల్ ఆఫీసర్స్ పేర్కొన్నారు. మరోవైపు నేపాల్ చర్యలపై బీహార్ ప్రభుత్వం గుర్రుగా ఉంది. గండక్ బ్యారేజీపై మరమ్మతు పనులను నేపాల్ గవర్నమెంట్ అడ్డుకోవటంపై ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారు బిహార్ సీఎం నితిశ్ కుమార్. ఈ బ్యారేజీ వల్ల బిహార్, యూపీలతో పాటు నేపాల్‌లోని టెరాయ్ ప్రాంతాల ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతున్నారు. ఇరు దేశాలు కలిసి బ్యారేజీ 18 గేట్లను పంచుకున్నాయి.




