AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ధోని, కేజ్రీవాల్ పేర్లను రాసి ఐసిస్ హెచ్చరికలు.. నవీ ముంబైలో హైఅలర్ట్

కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారత్‌లో విధ్వంసాలు సృష్టించేందుకు సిద్ధమౌతోంది. ఈ క్రమంలో నవీ ముంబైలోని కోప్టే బ్రిడ్జ్‌కు సపోర్ట్‌గా ఉన్న ఓ పిల్లర్‌పై ఐసిస్‌ను పొగుడుతూ కొన్ని వ్యాఖ్యలు కనిపించాయి. ఐసిస్‌కు చెందిన కొందరి టెర్రరిస్ట్‌ల పేర్లను అక్కడ రాసిన దుండగులు.. వారందరూ ఆ సంస్థ కోసం పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. ఇక ఈ లిస్ట్‌లో ఉగ్రవాదులైన అబూ బకర్ అల్ బాక్దాదీ, హఫీజ్ సయ్యద్ పేర్లతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, క్రికెటర్ […]

ధోని, కేజ్రీవాల్ పేర్లను రాసి ఐసిస్ హెచ్చరికలు.. నవీ ముంబైలో హైఅలర్ట్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 05, 2019 | 4:05 PM

Share

కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ భారత్‌లో విధ్వంసాలు సృష్టించేందుకు సిద్ధమౌతోంది. ఈ క్రమంలో నవీ ముంబైలోని కోప్టే బ్రిడ్జ్‌కు సపోర్ట్‌గా ఉన్న ఓ పిల్లర్‌పై ఐసిస్‌ను పొగుడుతూ కొన్ని వ్యాఖ్యలు కనిపించాయి. ఐసిస్‌కు చెందిన కొందరి టెర్రరిస్ట్‌ల పేర్లను అక్కడ రాసిన దుండగులు.. వారందరూ ఆ సంస్థ కోసం పోరాటం చేస్తున్నారని ప్రశంసించారు. ఇక ఈ లిస్ట్‌లో ఉగ్రవాదులైన అబూ బకర్ అల్ బాక్దాదీ, హఫీజ్ సయ్యద్ పేర్లతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, క్రికెటర్ ధోని పేర్లను కూడా పొందుపరిచారు. దీంతో అధికారులు అప్రమత్తమై.. నవీ ముంబైలో హై అలర్ట్ ప్రకటించారు.

కాగా దీనిపై నవీ ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మామూలుగా మద్యపానం సేవించేందుకే కొంతమంది యువకులు తరచుగా ఇక్కడికి వస్తుంటారని స్థానికులు తమతో చెప్పారని.. కానీ అన్ని కోణాల్లోనూ దీనిపై సమగ్ర విచారణను జరుపుతున్నామని పేర్కొన్నారు.

ఇక ఈ హెచ్చరికలపై ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘‘ఈ మెసేజ్‌లలో ఎప్పుడు, ఎక్కడ విధ్వంసం సృష్టిస్తారో ఉగ్రవాదులు స్పష్టంగా తెలిపారు. ఇందులో ప్రముఖులు, రాజకీయ నాయకుల పేర్లను కోడ్ భాషలో రాశారు. దీన్నిమేము అసలు ఉపేక్షించం. దీనిపై దర్యాప్తు వేగంగా జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. కాగా దీనిపై నవీ ముంబయి క్రైమ్ బ్రాంచ్‌తో ఓ ప్రత్యేక బృందం దర్యాప్తును చేస్తోంది.

Follow Us
ఒకప్పుడు మాల్స్‌లో పని చేసింది.. కట్ చేస్తే ఇప్పుడు
ఒకప్పుడు మాల్స్‌లో పని చేసింది.. కట్ చేస్తే ఇప్పుడు
విద్యార్ధుల వీపులు పగిలేలా కొట్టిన హెడ్ మాస్టర్.. ఆ తర్వాత సీన్‌
విద్యార్ధుల వీపులు పగిలేలా కొట్టిన హెడ్ మాస్టర్.. ఆ తర్వాత సీన్‌
6 ఇన్నింగ్స్..4 సార్లు డకౌట్..అయినా సరే అభిషేకే కావాలంటున్న కోచ్
6 ఇన్నింగ్స్..4 సార్లు డకౌట్..అయినా సరే అభిషేకే కావాలంటున్న కోచ్
చిల్లీ చికెన్ ముద్దలా అవుతోందా?.. ఇవి కలిపితే యమా టేస్టీ..
చిల్లీ చికెన్ ముద్దలా అవుతోందా?.. ఇవి కలిపితే యమా టేస్టీ..
నెలకు రూ.1000 కడితే చాలు 1 కోటి రూపాయలు.. అప్పుల బాధే ఉండదు..!
నెలకు రూ.1000 కడితే చాలు 1 కోటి రూపాయలు.. అప్పుల బాధే ఉండదు..!
ఆమె ఏపీకి వచ్చి ప్రియుడ్ని కలిసి ఒక్కసారిగా స్టన్ అయింది...
ఆమె ఏపీకి వచ్చి ప్రియుడ్ని కలిసి ఒక్కసారిగా స్టన్ అయింది...
తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్
తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్
గుమ్మం దగ్గర ఇవి ఉంటే.. నెగిటివ్ ఎనర్జీకి రెడ్ కార్పెట్ వేసినట్టే
గుమ్మం దగ్గర ఇవి ఉంటే.. నెగిటివ్ ఎనర్జీకి రెడ్ కార్పెట్ వేసినట్టే
శివరాత్రి పండక్కి చికెన్ కూర వండలేదనీ.. భర్త సూసైడ్! ఎక్కడంటే..
శివరాత్రి పండక్కి చికెన్ కూర వండలేదనీ.. భర్త సూసైడ్! ఎక్కడంటే..
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స!
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స!