లోక్‌సభ సమావేశాల ముగింపురోజు మోడీ భావోద్వేగ ప్రసంగం

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2020 | 6:22 PM

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాల ముగింపు సభలో ప్రధాని మోడీ భావేద్వేగంగా ప్రసంగించారు. 2014లో లోక్‌సభకు తాను మొదటిసారిగా వచ్చానని, అంతా కొత్తగా అనిపించేదని చెప్పారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి అర్ధం చేసుకున్నానని తెలిపారు. మోడీ తన స్పీచ్‌లో ప్రస్తావించిన హైలెట్ పాయింట్స్.. 1) ప్రపంచ డిజిటల్ మ్యాప్‌లో భారత్ తన స్థానం మెరుగుపరుచుకుంది. 2) నోట్ల రద్దుపై తాను మాట్లాడితే పార్లమెంటులో భూకంపం వస్తుందని 2016 రాహుల్ గాంధీ అన్న మాటలకు కౌంటర్‌గా మోడీ స్పందించారు. […]

లోక్‌సభ సమావేశాల ముగింపురోజు మోడీ భావోద్వేగ ప్రసంగం

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాల ముగింపు సభలో ప్రధాని మోడీ భావేద్వేగంగా ప్రసంగించారు. 2014లో లోక్‌సభకు తాను మొదటిసారిగా వచ్చానని, అంతా కొత్తగా అనిపించేదని చెప్పారు. ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి అర్ధం చేసుకున్నానని తెలిపారు.

మోడీ తన స్పీచ్‌లో ప్రస్తావించిన హైలెట్ పాయింట్స్..

1) ప్రపంచ డిజిటల్ మ్యాప్‌లో భారత్ తన స్థానం మెరుగుపరుచుకుంది. 2) నోట్ల రద్దుపై తాను మాట్లాడితే పార్లమెంటులో భూకంపం వస్తుందని 2016 రాహుల్ గాంధీ అన్న మాటలకు కౌంటర్‌గా మోడీ స్పందించారు. భూకంపం వస్తుందని కొందరు హెచ్చరించారు. కానీ అలాంటిదేమీ చూడలేదు. 3) ప్రపంచంలో భారత దేశం 6వ పెద్ద ఆర్ధిక శక్తిగా ఎదిగింది. 5 ట్రిలియన్ డాలర్లకు చేరువగా ఉంది. 4) లోక్‌సభ సెషన్స్ ఎక్కువ శాతం బాగా జరిగాయి. ఇది చాలా మంచి విషయం. 5) స్పీకర్, రక్షణ శాఖ మంత్రితో సహా ఈ లోక్‌సభలో అత్యధికంగా 44 మంది మహిళా ఎంపీలున్నారు. 6) భారత దేశ ఆత్మవిశ్వాసం ఎప్పుడూ లేనంత ఎక్కువగా ఉంది. ఇది చాలా మంచి పరిణామం. 7) ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించుకుంటున్నాయి. ఆ దిశగా తన వంతు ప్రయత్నం చేసింది. అంతర్జాతీయ సోలార్ అలియన్స్‌ ఏర్పాటుకు కృషి చేసింది. 8) ములాయం సింగ్ యాదవ్ మా ప్రభుత్వాన్ని దీవించారు. 9) ఈ సభలో నేను ఎలా కౌగిలించుకోవడం ఎలా? వేరే వారిమీద పడిపోవడం ఎలా అనేది నేర్చుకున్నాను. 10) సభలో కన్ను కొట్టడాన్ని కూడా చూశాను. 11) దుష్ట శక్తి ప్రయత్నం మొత్తం వృధా కావాలి. 12) ఉపగ్రహాల ప్రయోగాల్లో గొప్ప అభివృద్ధి సాధించాం. 13) మా పాలనలో బంగ్లాదేశ్‌తో భూసరిహద్దు వివాదం పరిష్కారమైంది. 14) ప్రకృతి విపత్తులతో కష్టాలు ఎదుర్కొన్న దేశాలకు ఎంతో సాయం చేశాం. 15) అవినీతికి వ్యతిరేకంగా అనేక చట్టాలు చేశాం. 16) ఈ సభలో 203 బిల్లులు ఆమోదం పొందాయి. 17) జీఎస్టీ బిల్లు తెచ్చి దేశ ఆర్థిక రంగ రూపురేఖలు మార్చాం. 18) ఐక్యరాజ్య సమితిలో మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ జయంతులు నిర్వహిస్తున్నారు. భారత గౌరవ పెరిగింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu