కార్మికుల సమస్యలు పట్టడం లేదా జగన్ గారూ.. లోకేష్ ట్వీట్..

ఏపీలో మరో కొత్త చర్చ మొదలైంది. మొన్నటి దాకా వరద రాజకీయం.. ఇప్పడు తాజాగా ఇసుక రాజకీయం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత, భవన నిర్మాణ రంగ కార్మికులు పడుతున్న కష్టాలపై టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. మంగళగిరిలో జరిగిన నిరసన కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. కార్మికుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లోకేష్ విమర్శించారు. ఉపాధి కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేయాలన్నారు. ఒక్క ఛాన్స్ […]

కార్మికుల సమస్యలు పట్టడం లేదా జగన్ గారూ.. లోకేష్ ట్వీట్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 30, 2019 | 3:00 PM

ఏపీలో మరో కొత్త చర్చ మొదలైంది. మొన్నటి దాకా వరద రాజకీయం.. ఇప్పడు తాజాగా ఇసుక రాజకీయం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత, భవన నిర్మాణ రంగ కార్మికులు పడుతున్న కష్టాలపై టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. మంగళగిరిలో జరిగిన నిరసన కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు.

కార్మికుల కష్టాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లోకేష్ విమర్శించారు. ఉపాధి కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేయాలన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. మరోవైపు ధర్నా ఫోటోలను మార్ఫింగ్ చేశారంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక లేక, పనులు లేక కార్మికులు అల్లాడుతుంటే పట్టించుకోని జగన్ గారూ! పేదలకు అండగా నిలబడి టీడీపీ చేస్తున్న పోరాటాన్ని అపహాస్యం చేసి పక్కదారి పట్టించడానికి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ఇలా నీచ ప్రచారానికి దిగుతారా.. మీ మార్ఫింగ్ కుట్రలతో ప్రజల బాధల్ని ఎగతాళి చేస్తారా? అంటూ మండిపడ్డారు.