నంద్యాల: నడిరోడ్డుపై నిండు గర్భిణి దారుణ హత్య

నంద్యాలలో దారుణం జరిగింది. నిండు గర్భిణీ దారుణ హత్యకు గురయింది. లక్ష్మి అనే వివాహితను మరో మహిళ కత్తితో పొడిచి చంపేసినన ఘటన నంద్యాల లోని వైఎస్సార్ నగర్లో చోటుచేసుకుంది.

నంద్యాల: నడిరోడ్డుపై నిండు గర్భిణి దారుణ హత్య

నంద్యాలలో దారుణం జరిగింది. నిండు గర్భిణీ దారుణ హత్యకు గురయింది. లక్ష్మి అనే వివాహితను మరో మహిళ కత్తితో పొడిచి చంపేసిన ఘటన నంద్యాల లోని వైఎస్సార్ నగర్లో చోటుచేసుకుంది. లక్ష్మి తండ్రి వెంకట రాముడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకొని లక్ష్మి , ఆమె తల్లి భారతి ఆ మహిళతో వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ జరుగుతోనన్న సమయంలో సదరు మహిళ తీవ్ర కోపోద్రిక్తురాలై క్షణికావేశంలో లక్ష్మిపై కత్తితో దాడి చేసింది. 8 నెలల గర్భంతో ఉన్న లక్ష్మికి కడుపులో కత్తి బలంగా దిగడంతో తీవ్ర రక్తస్రావమై స్పాట్ లోనే మృతి చెందింది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read :

పంటలకు మద్దతు ధరలు ప్రకటించిన ఏపీ సర్కార్

దేశంలో కరోనా కలవరం, 24 గంటల్లో 1,181 మరణాల

ఏపీ గ్రామ సచివాలయ పరీక్షల ప్రాథమిక కీ విడుదల