AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైతు, సమంత జంటగా మరో సినిమా..! ‘థ్యాంక్‌ యూ’

Naga Chaitanya and Samantha pair : నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా మ‌రో సినిమా రాబోతోందా? అవునంటున్నాయి సినీ వర్గాలు. నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి ‘థ్యాంక్‌ యూ’ అనే పేరుని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నాగచైతన్య సరసన సమంత దాదాపు ఓకే అయినట్లుగా అనుకుంటున్నారు. పెళ్లి తర్వాత ఈ జోడీ ‘మజిలీ’లో నటించి విజయాన్ని అందుకున్నారు. ‘థ్యాంక్‌ యూ’ కథ నచ్చడంతో చైతూ, సమంత నటించాలని […]

చైతు, సమంత జంటగా మరో సినిమా..! ‘థ్యాంక్‌ యూ’
Sanjay Kasula
|

Updated on: Jul 02, 2020 | 6:03 AM

Share

Naga Chaitanya and Samantha pair : నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట‌గా మ‌రో సినిమా రాబోతోందా? అవునంటున్నాయి సినీ వర్గాలు. నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రానికి ‘థ్యాంక్‌ యూ’ అనే పేరుని ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే నాగచైతన్య సరసన సమంత దాదాపు ఓకే అయినట్లుగా అనుకుంటున్నారు. పెళ్లి తర్వాత ఈ జోడీ ‘మజిలీ’లో నటించి విజయాన్ని అందుకున్నారు. ‘థ్యాంక్‌ యూ’ కథ నచ్చడంతో చైతూ, సమంత నటించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ‘మనం’ తర్వాత నాగచైతన్య, విక్రమ్‌ కె.కుమార్‌ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. అయితే ఈ టాలీవుడ్ యువ జంట కలిసి మరోసారి నటిస్తున్నారనే టాక్ రావడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అప్పుడు పండుగ మొదలు పెట్టారు.

టాలీవుడ్‌లో `ఏమాయ చేసావె` చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన స‌మంత ఆ సినిమాలోని త‌న హీరో నాగ‌చైత‌న్య‌నే పెళ్లి చేసుకొని హైద‌రాబాద్‌లోనే సెటిలైపోయింది. పెళ్లికి ముందుకు ఇద్ద‌రూ క‌లిసి ఓ నాలుగైదు సినిమాలు చేసినా పెళ్లి త‌ర్వాత ఇద్ద‌రూ క‌లిసి మ‌ళ్లీ క‌లిసి న‌టిస్తున్నారంటే అంద‌రిలోనూ ఆస‌క్తి ఉంటుంది.