ఆ విద్యార్థికి గూగుల్‌లో రూ.1.2 కోట్ల జీతంతో ఉద్యోగం

ఐఐటీ ఎంట్రన్స్‌లో ఫెయిలైన ఆ యువకుడిని అదృష్టం వరించింది. లండన్‌లోని గూగుల్ ఆఫీస్‌లో రూ.1.2 కోట్ల జీతంతో ఉద్యోగం లభించింది. ముంబయిలోని ఎల్.ఆర్. తివారీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీఈ (కంప్యూటర్ సైన్స్) ఫైనల్ ఇయర్ చదువుతున్న అబ్దుల్లా ఖాన్(21) గూగుల్‌లోని కాంపెటిటీవ్ ప్రోగ్రామింగ్ ఛాలెంజెస్‍లో తన ప్రొఫైల్ పెట్టాడు. అతని ప్రొఫెల్‌ను ఎంపిక చేసిన గూగుల్.. ఆన్‌లైన్ ద్వారా అతన్ని ఇంటర్వ్యూ చేసింది. అనంతరం లండన్‌లో తుది దశ ఎంపిక ప్రక్రియ కోసం అతన్ని లండన్‌కు ఆహ్వానించింది. […]

ఆ విద్యార్థికి గూగుల్‌లో రూ.1.2 కోట్ల జీతంతో ఉద్యోగం
Follow us

| Edited By:

Updated on: Mar 29, 2019 | 4:25 PM

ఐఐటీ ఎంట్రన్స్‌లో ఫెయిలైన ఆ యువకుడిని అదృష్టం వరించింది. లండన్‌లోని గూగుల్ ఆఫీస్‌లో రూ.1.2 కోట్ల జీతంతో ఉద్యోగం లభించింది. ముంబయిలోని ఎల్.ఆర్. తివారీ ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీఈ (కంప్యూటర్ సైన్స్) ఫైనల్ ఇయర్ చదువుతున్న అబ్దుల్లా ఖాన్(21) గూగుల్‌లోని కాంపెటిటీవ్ ప్రోగ్రామింగ్ ఛాలెంజెస్‍లో తన ప్రొఫైల్ పెట్టాడు.

అతని ప్రొఫెల్‌ను ఎంపిక చేసిన గూగుల్.. ఆన్‌లైన్ ద్వారా అతన్ని ఇంటర్వ్యూ చేసింది. అనంతరం లండన్‌లో తుది దశ ఎంపిక ప్రక్రియ కోసం అతన్ని లండన్‌కు ఆహ్వానించింది. ఈ సందర్భంగా గూగుల్ అతనికి భారీ ఆఫర్‌ ఇచ్చింది. ఏడాదికి రూ.54.5 లక్షలు జీతంతోపాటు నాలుగేళ్లపాటు 15 శాతం బోనస్‌తో మరో రూ.58.9 లక్షలు చెల్లిస్తామని పేర్కొంది. ఖాన్ సెప్టెంబరు నుంచి గూగూల్‌లోని రిలయబిలిటీ ఇంజినీరింగ్ టీమ్‌లో విధులు నిర్వహించనున్నాడు.