జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు షురూ…!

ఎప్పుడెప్పుడా అని వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న జియో గిగాఫైబర్ సేవలు ఎట్టకేలకు ఇవాళ అధికారికంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ సేవలను ప్రారంభిస్తామని గత నెలలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే ఆ సేవలను ఇవాళ ప్రారంభించారు. ఇక వాటికి గాను పూర్తి ప్లాన్ల వివరాలను కూడా జియో వెల్లడించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. జియో ఫైబర్‌ ప్లాన్లను బ్రాంజ్‌, సిల్వర్‌, గోల్డ్‌, డైమండ్‌, ప్లాటినమ్‌, […]

జియో గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు షురూ...!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 05, 2019 | 8:21 PM

ఎప్పుడెప్పుడా అని వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న జియో గిగాఫైబర్ సేవలు ఎట్టకేలకు ఇవాళ అధికారికంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ సేవలను ప్రారంభిస్తామని గత నెలలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే ఆ సేవలను ఇవాళ ప్రారంభించారు. ఇక వాటికి గాను పూర్తి ప్లాన్ల వివరాలను కూడా జియో వెల్లడించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

జియో ఫైబర్‌ ప్లాన్లను బ్రాంజ్‌, సిల్వర్‌, గోల్డ్‌, డైమండ్‌, ప్లాటినమ్‌, టైటానియం కేటగిరీలుగా విభజించింది. కనీస ప్లాన్‌ ధర రూ.699 కాగా గరిష్ఠ నెలవారీ ధర రూ.8,499గా నిర్ణయించారు.

* కనీస ప్లాన్‌ రూ.699 ఎంచుకుంటే 100 ఎంబీపీఎస్‌ వేగంతో 100 జీబీ+50జీబీ అదనపు డేటాను అందించనున్నారు. ఇందులోనే ఉచిత వాయిస్‌ కాలింగ్‌, టీవీ వీడియో కాలింగ్‌, కాన్ఫెన్సింగ్‌ సదుపాయాలు ఉంటాయి. * రెండో ప్లాన్‌ ధర రూ.849. దీని వేగం 100 ఎంబీపీఎస్‌. 200జీబీ+200జీబీ అదనపు డేటాతో ఉచిత వాయిస్‌ కాలింగ్‌, టీవీ వీడియో కాలింగ్‌, కాన్ఫెన్సింగ్‌ వంటి సదుపాయాలు ఉంటాయి. * రూ.1,299 ప్లాన్‌తో 250 ఎంబీపీఎస్‌ వేగంతో డేటా పొందవచ్చు. ఇందులో 500జీబీ+250జీబీ అదనపు డేటా లభిస్తుంది. * 500 ఎంబీపీఎస్‌ వేగం కావాలంటే రూ.2,499 ప్లాన్‌ను ఎంచుకోవాలి. ఇందులో భాగంగా 1250జీబీ+250జీబీ అదనపు డేటా పొందవచ్చు. * రూ.3,999 ప్లాన్‌తో 2,500 జీబీ, రూ.8,499 ప్లాన్‌తో 5 వేల జీబీల డేటా పొందొచ్చు. ఈ రెండు ప్లాన్లలో డేటా వేగం 1 జీబీపీఎస్‌ ఉంటుంది. ఉచిత వాయిస్‌ కాలింగ్‌, టీవీ వీడియో కాలింగ్‌, కాన్ఫెన్సింగ్‌ సదుపాయాలు ఈ ప్లాన్లు అన్నింటిలోనూ ఉంటాయి.

కాగా జియో గిగాఫైబర్ సేవలకు గాను వార్షిక ప్లాన్‌ను ఒకేసారి తీసుకునే వారికి వెల్కం ఆఫర్ కింద రూ.5వేల విలువైన జియో హోం గేట్‌వే, రూ.6400 విలువైన జియో 4కె సెట్ టాప్ బాక్స్‌లను ఉచితంగా అందిస్తున్నారు. దీంతోపాటు 3 నెలల పాటు జియో సినిమా, జియో సావన్ యాప్‌లకు, ఓటీటీ యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.