MS Dhoni: ఐపీఎల్ ఆర్జనలో ధోనిదే అగ్రస్థానం.. మరి రోహిత్, కోహ్లీలు ఎంత సంపాదించారంటే.?
MS Dhoni: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఆదాయం పొందిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని అవతరించాడు...
IPL Highest Paid Player MS Dhoni: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఆదాయం పొందిన ఆటగాడిగా చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని అవతరించాడు. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో రెండు జట్లు(సీఎస్‌కే, ఆర్‌పీఎస్) తరపున ఆడిన ధోని.. సుమారు రూ. 137 కోట్లు ఆర్జించినట్లు ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్ ఇన్‌సైడ్ స్పోర్ట్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.
2008 ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో ధోనిని రూ.6 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ దక్కించుకుంది. వికెట్ల వెనుక తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ.. చెన్నై జట్టుకు మూడు ఐపీఎల్ ట్రోఫీలను కట్టబెట్టాడు. అంతేకాదు ఈ లీగ్‌లో ధోనికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇక గడిచిన సీజన్‌లో తలా రూ. 15 కోట్లు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రకటనలు, అవార్డుల రూపంలో కాకుండా కేవలం మ్యాచ్‌లు ఆడటం ద్వారా ధోని రూ. 137 కోట్లు సంపాదించడం విశేషం. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రూ. 131 కోట్లతో రెండో స్థానంలో ఉండగా, రాయల్ ఛాలెంజర్స్ సారధి విరాట్ కోహ్లి రూ. 126 కోట్లతో మూడో స్థానంలో ఉన్నాడు.
Also Read:
‘జగనన్న అమ్మఒడి’ వివరాలను చెక్ చేసుకోండిలా.. సూచనలు ఇచ్చిన పాఠశాల విద్యాశాఖ..
మరో చోట ప్రత్యక్షమైన వింత స్థంభం.. షాకవుతున్న ప్రజలు.. మిస్టరీని చేధిస్తున్న పరిశోధకులు..