నేను కోలుకుంటున్నాను…వీడియో విడుదల చేసిన నవనీత్ కౌర్
కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా తాను కోలుకుంటున్నానని తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా తాను కోలుకుంటున్నానని తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తనను ఐసీయూ నుంచి జనరల్ వార్డుకు మార్చారనీ.. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నట్టు ట్విటర్‌లో పేర్కొన్నారు. అభిమానుల ఆశీస్సులు తనతో ఉన్నాయన్న నవనీత్ కౌర్ అన్నారు. త్వరగా కోలుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశారు. మళ్లీ ప్రజాసేవకు సిద్ధమవుతానని చెప్పుకొచ్చారు.
आज मला ICU मधून सामान्य कक्षात स्थलांतर करण्यात आले आहे, आता माझी प्रकृति थोड़ी स्थिर आहे, आपण सर्वांचा आशीर्वाद माझ्या सोबत आहे, मी लवकर बरी होऊन जनसेवेत पुन्हा सज्ज होणार… pic.twitter.com/ScmSlui25E
— Navneet Kaur Rana (@NavneetKRana) August 15, 2020
తాను కరోనా బారినపడినట్టు ఆగస్టు 6న స్వయంగా ప్రకటించిన నవనీత్ కౌర్.. ముందుగా అమరావతిలో ప్రాథమికంగా చికిత్స తీసుకున్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో గురువారం సాయంత్రం ఆమెను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. తన కుటుంబ సభ్యులకు కరోనా సోకడంతో వారిని జాగ్రత్తగా చూసుకొనే క్రమంలో తానూ ఈ మహమ్మారి బారిన పడినట్టు నవనీత్ కౌర్ ట్విటర్‌లో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆమె కుటుంబ సభ్యులంతా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నట్టు వైద్య అధికారులు తెలిపారు.