దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం..
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేస్తామని ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దుబ్బాక నుంచి పోటీ చేయాలని పీసీసీ నిర్ణయించిందని స్పష్టం చేశారు.
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేస్తామని ఆ పార్టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. దుబ్బాక నుంచి పోటీ చేయాలని పీసీసీ నిర్ణయించిందని స్పష్టం చేశారు. పోటీ విషయంలో ఎవరూ అనుమానపడాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. దుబ్బాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే సొలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. అయితే సిద్దిపేటకు చెందిన టీఆర్ఎస్ నాయకురాలు భవానీ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆమెతో పాటు మరో పది మంది అనుచరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆహ్వానించారు.