AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీలో చేరగానే మోత్కుపల్లి ఎంతమాట అనేశారు!

సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చాలా కాలంగా ఏ పార్టీలో చేరని మోత్కుపల్లి మంగళవారం న్యూఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి.నడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చాలా కాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిన మోత్కుపల్లి పలు అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించి పార్టీని వీడారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి.. […]

బీజేపీలో చేరగానే మోత్కుపల్లి ఎంతమాట అనేశారు!
Rajesh Sharma
|

Updated on: Jan 07, 2020 | 5:48 PM

Share

సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తర్వాత చాలా కాలంగా ఏ పార్టీలో చేరని మోత్కుపల్లి మంగళవారం న్యూఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పి.నడ్డా సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చాలా కాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగిన మోత్కుపల్లి పలు అంశాలపై టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించి పార్టీని వీడారు.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి.. ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమం తీవ్రంగా కొనసాగిన సమయంలోను ఆయన టీడీపీ పక్షానే నిలబడ్డారు. 2014లో రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా తెలంగాణలో తెలుగుదేశంపార్టీకి సేవ చేస్తూ అలాగే కొనసాగారు. అయితే, ఒక దశలో మోత్కుపల్లికి గవర్నర్ పదవి వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంతో టీడీపీ స్నేహం నెరిపినన్ని రోజులు మోత్కుపల్లి గవర్నర్ గిరిపై ఆశతోనే గడిపారు. ఆ తర్వాత 2018 తొలి నాళ్ళలో ప్రత్యేక హోదా అంశంపై బీజేపీతో విభేదించిన చంద్రబాబు.. ఎన్డీయేకు దూరమయ్యారు. దాంతో మోత్కుపల్లికి గవర్నర్ గిరి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.

అదే అసంతృప్తితో కొంతకాలంపాటు టీడీపీలో కొనసాగిన మోత్కుపల్లి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తి మరీ పార్టీకి దూరమయ్యారు. ఆ వెంటనే ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరతారని అంతా అనుకున్నారు. కానీ కేసీఆర్ నుంచి ఆహ్వానం లేకపోవడమో లేక మరేదైనా కారణమో కానీ ఆయన ఒంటరిగానే వుండిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి దారుణంగా ఓటమి పాలయ్యారు.

దళితుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తిగా మోత్కుపల్లికి పేరుంది. ప్రస్తుతం మునిసిపల్ ఎన్నికల తరుణంలో కొన్ని రోజులుగా ఆయన బీజేపీ నేతలతో తరచూ సమావేశమవుతున్నారు. గత వారం రెండు దఫాలుగా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లతో సమావేశమైన మోత్కుపల్లి మంగళవారం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ చేస్తున్న అభివృద్ధి, తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆకర్షితున్నై ఆ పార్టీలో చేరానని ఆయన చెప్పారు. కేసీఆర్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అమిత్ షాకు వివారించామని, పార్టీలో ఒక సైనికునిలా పనిచేస్తానని ఆయనంటున్నారు.

Follow Us