AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్థాన్‌లో డాక్టర్ నిర్వాకం.. 400 మందికి ఎయిడ్స్ సోకేలా ఇంజెక్షన్!

దాయాది దేశం పాకిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉద్దేశపూర్వకంగానో లేక అనుకోకుండానో ఓ వైద్యుడు కలుషిత సిరంజ్‌ని వాడడంతో దాదాపు 400 మంది చిన్నారులకు ఎయిడ్స్(హెచ్ఐవీ వైరస్) సోకింది. దీంతో సదరు డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు ముందు హాజరుపరచి రిమాండ్ కు తరలించారు. లర్కానా జిల్లాలోని రటోడెరో ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ ముజఫర్ గంగర్ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. అయితే సిరంజ్‌లు అందుబాటులో లేకపోవడంతో వైద్యులు ఒకే సూదిని వేడినీటిలో మరగబెట్టి వాడటం […]

పాకిస్థాన్‌లో డాక్టర్ నిర్వాకం.. 400 మందికి ఎయిడ్స్ సోకేలా ఇంజెక్షన్!
Ravi Kiran
|

Updated on: May 17, 2019 | 5:52 PM

Share

దాయాది దేశం పాకిస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. ఉద్దేశపూర్వకంగానో లేక అనుకోకుండానో ఓ వైద్యుడు కలుషిత సిరంజ్‌ని వాడడంతో దాదాపు 400 మంది చిన్నారులకు ఎయిడ్స్(హెచ్ఐవీ వైరస్) సోకింది. దీంతో సదరు డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు ముందు హాజరుపరచి రిమాండ్ కు తరలించారు. లర్కానా జిల్లాలోని రటోడెరో ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ ముజఫర్ గంగర్ వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. అయితే సిరంజ్‌లు అందుబాటులో లేకపోవడంతో వైద్యులు ఒకే సూదిని వేడినీటిలో మరగబెట్టి వాడటం ప్రారంభించారు. ఈ క్రమంలో దాదాపు 400 మంది చిన్నారులకు ఎయిడ్స్ సోకింది.

వీరిలో అత్యధికంగా చిన్న పిల్లలు ఉండడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. హెచ్ఐవీ కేసులు బయటపడటంతో ఈ ఆసుపత్రి పరిధిలో చికిత్స పొందిన ప్రజలందరికీ హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘోరానికి కారకుడైన వైద్యుడు ముజఫర్ కు కూడా ఎయిడ్స్ ఉన్నట్లు అధికారులు తేల్చారు. అయితే ఈ వ్యవహారంపై ముజఫర్ స్పందిస్తూ..‘నాకు హెచ్‌ఐవీ ఉన్న సంగతి తెలియదు. కావాలనే కలుషిత సిరంజ్ వాడానని చేస్తున్న ఆరోపణలు కూడా అవాస్తవం’ అని స్పష్టం చేశాడు.

కాగా, చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు దాతలు ముందుకు రావాలని పాకిస్థాన్ అధికారులు కోరుతున్నారు. ఎయిడ్స్ కేసులో పాకిస్థాన్ ఆసియాలోనే రెండో స్థానంలో ఉంది. ఒక్క 2017లోనే పాక్ లో కొత్తగా 20,000 కేసులు నమోదయ్యాయి.

Follow Us
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఎల్లుండి ఆలయం మూసివేత!
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఫర్హాన్ వీరవిహారం.. శ్రీలంకపై సెంచరీతో 5 ప్రపంచ రికార్డులు బద్ధలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి.. ధృవీకరించిన ఆ దేశ మీడియా..
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
యుద్ద ప్రభావం.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు ఎంతంటే
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
ఈడెన్‌లో ఆధిపత్యం ఎవరిది.. లెక్కలు చూస్తే ఫ్యాన్స్‌కు పండగే..!
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
గౌరవం ఇచ్చేది వస్తువులు కాదు.. మనం చేసే పనులే: మనోజ్
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
సైఫ్ బాధ్యతారాహిత్యంపై దర్శకుడు రాహుల్ రవాలి ఫైర్!
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మృతి: డొనాల్డ్ ట్రంప్ సంచలన పోస్ట్
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..
లగ్జరీ బ్రాండ్ హీల్స్ తో నిక్కీ తంబోలి తళుక్కు..