ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెతుత్తున్నాయి. ముఖ్యంగా రాజధాని ముంబై నగరంలో సోమవారం తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వర్షాల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులతో పాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే వర్షాల వలన ట్రైన్ సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని సెంట్రల్ రైల్వే ప్రకటించింది. లోకల్ రైళ్లన్నీ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని స్పష్టం చేశారు. ఇక భారీ వర్షాలతో ముంబైలో రాకపోకలకు […]

ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ

మహారాష్ట్రను భారీ వర్షాలు ముంచెతుత్తున్నాయి. ముఖ్యంగా రాజధాని ముంబై నగరంలో సోమవారం తెల్లవారుజాము నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వర్షాల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులతో పాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే వర్షాల వలన ట్రైన్ సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని సెంట్రల్ రైల్వే ప్రకటించింది. లోకల్ రైళ్లన్నీ షెడ్యూల్ ప్రకారం నడుస్తున్నాయని స్పష్టం చేశారు.

ఇక భారీ వర్షాలతో ముంబైలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మబ్బులు దట్టంగా కమ్మేయడంతో పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. మరికొన్ని విమాన సర్వీసుల దారిని మళ్లించారు. కాగా మరికొన్ని రోజులు ఈ వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇదిలా ఉంటే తాజా వర్షాలతో శివాజీనగర్‌లో ఓ ఇంటి పైకప్పు కూలింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.