ఇంతకాలం తిండి పెట్టిన వృద్ధురాలు మృతితో తల్లడిల్లిన కోతి.. హృదయాలను తాకిన వానరం భావోద్వేగం..!
సాధారణంగా మనిషికి, జంతువులకు మధ్య స్నేహబంధం గురించి చాలాసార్లు వినే ఉంటాం. నిజ జీవితంలో అలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అయితే, అలాంటి సన్నివేశం కనిపించినప్పుడల్లా మనస్సుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఒక మూగజీవి మనిషితో ఎంతో నమ్మకంగా, వారితో పాటు కలిసి జీవిస్తూ, తింటూ, తిరుగుతుందో చూస్తే ఆశ్చర్యం కలగకమానదు.

సాధారణంగా మనిషికి, జంతువులకు మధ్య స్నేహబంధం గురించి చాలాసార్లు వినే ఉంటాం. నిజ జీవితంలో అలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అయితే, అలాంటి సన్నివేశం కనిపించినప్పుడల్లా మనస్సుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఒక మూగజీవి మనిషితో ఎంతో నమ్మకంగా, వారితో పాటు కలిసి జీవిస్తూ, తింటూ, తిరుగుతుందో చూస్తే ఆశ్చర్యం కలగకమానదు. మరీ ముఖ్యంగా, సాధారణంగా మనుషులకు అత్యంత దగ్గర ఉండే కోతి ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఉన్నప్పుడు మరింత ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి అరుదైన మనిషి-కోతి స్నేహం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆసక్తికరమైన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.
కర్ణాటకలోని రాయర దొడ్డిలో, వయోవృద్ధాప్య అనారోగ్యంతో సోమవారం (మార్చి 30) కన్నుమూసిన 85 ఏళ్ల పార్వతమ్మ. ఆమె మరణాన్ని తట్టుకోలేక ఆమె మృతదేహాన్ని ఒక కోతి కౌగిలించుకుని ఏడుస్తున్న దృశ్యం అందరినీ కలచివేసింది. ఆ కోతి స్పష్టమైన దుఃఖం, ఆ మహిళను విడిచి వెళ్ళడానికి నిరాకరించడం సోషల్ మీడియా వినియోగదారుల హృదయాలను కదిలించాయి.
కొన్నేళ్లుగా, పార్వతమ్మ తన ఇంటి దగ్గరకు వచ్చే కోతులకు ఆహారం పెట్టే ఆచారాన్ని పాటించారు. చాలామంది ఆ కోతులను ఒక పీడగా భావించినప్పటికీ, పార్వతమ్మ మాత్రం వాటిని తన స్నేహితులుగా భావించి, ఆహారం, ప్రేమను అందించేవారు. కాలక్రమేణా వారి బంధం బలపడింది. ఇది అంత్యక్రియల సమయంలో స్పష్టంగా కనిపించింది.
ఇటీవల పార్వతమ్మ అనారోగ్యం, వృద్ధాప్య సమస్యలతో ప్రాణాలు వదిలారు. పార్వతమ్మ భౌతికకాయానికి ఆమె నివాసంలో అంతిమ సంస్కారాలు జరుగుతుండగా, కోతులలో ఒకటి ఆ గుంపు వద్దకు వచ్చింది. అది ఆహారం కోసం వెతకకుండా, ప్రశాంతంగా జనసమూహం మధ్య నుండి నడుచుకుంటూ వెళ్లి ఆమె పక్కన నిశ్శబ్దంగా కూర్చుంది. తనను ఇంతకాలం కాపాడిన ఆ మహిళతో బహుశా ఇదే చివరి క్షణం కాబోలు అన్నట్లుగా, ఆ కోతి తన తలను పార్వతమ్మ తలకు ఆనించి కన్నీళ్లు కార్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.
ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ, ఎవరైనా తమ పట్ల దయ చూపినప్పుడు జంతువులు దాన్ని ఎప్పటికీ మర్చిపోవని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. “ఆ కోతి ఆమెను కౌగిలించుకున్న తీరు, ప్రేమ మాటలకు, జాతులకు అతీతమైనదని చూపిస్తుంది,” అని ఒక వినియోగదారు వ్యాఖ్యానించగా, మరొకరు, “అవి నిజమైన మనుషులు, కానీ మనం వాటిని జంతువులని పిలుస్తాం,” అని అన్నారు. ఇదిలావుంటే, అంతకు ముందు కూడా ఒక ఆవు, ఓ చిరు వ్యాపారిపట్ల ఎంతో ప్రేమగా మెలిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సైతం అప్పట్లో తెగ వైరల్ అవుతోంది.
వీడియో క్లిప్‌ను ఇక్కడ చూడండి:
A final goodbye to his Caretaker❗️
In a deeply moving moment from Rayara Doddi in Channapatna near Bengaluru, an 85-year-old woman who regularly fed monkeys was hugged by one of them after her passing. https://t.co/M94Fbx3uyo pic.twitter.com/ouYpihP0Mp
— Bhakt Prahlad🚩 (@RakeshKishore_l) April 1, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
