AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్విమ్మింగ్ పూల్‌లో విగతజీవులుగా తల్లీ, ఇద్దరు కూతుళ్లు.. బుధవారం రాత్రి ఏం జరిగింది..?

స్విమ్మింగ్ పూల్‌లో తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో కలకలం రేపింది.. అవి ప్లాన్ ప్రకారం చేసిన హత్యలా..! లేక ప్రమాదవశాత్తు చనిపోయారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. సీసీ కెమెరా హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

స్విమ్మింగ్ పూల్‌లో విగతజీవులుగా తల్లీ, ఇద్దరు కూతుళ్లు.. బుధవారం రాత్రి ఏం జరిగింది..?
Warangal Crime News
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Apr 02, 2026 | 9:17 AM

Share

స్విమ్మింగ్ పూల్‌లో తల్లితో సహా ఇద్దరు కూతుళ్లు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లాలో కలకలం రేపింది.. అవి ప్లాన్ ప్రకారం చేసిన హత్యలా..! లేక ప్రమాదవశాత్తు చనిపోయారా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.. సీసీ కెమెరా హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు 3 నెలల గర్భిణీ.. అని పోలీసులు తెలిపారు. ఈ విషాద సంఘటన హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేల్ గ్రామ శివారులో జరిగింది.. మహమ్మద్ చాంద్ పాషా అనే వ్యక్తి ధరణి వెంచర్‌లో స్విమ్మింగ్ పూల్ నిర్వహిస్తున్నాడు.

చాంద్ పాషా కొడుకు హజారుద్దీన్ తన భార్య ఫర్హాత్(26) కూతుళ్లు ఉమేరా (8), అయేషా (6) కలిసి స్విమ్మింగ్ పూల్ కు వచ్చారు.. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు ముగ్గురు అదే స్విమ్మింగ్ పూల్‌లో మునిగి మృతిచెందారు. బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.. ఏం జరిగిందో తెలియదు కానీ స్విమ్మింగ్ ఫూల్లో లో తల్లీ, ఇద్దరు కూతుళ్ల మృతదేహాలు లభించాయి. మృతదేహాలను ఎంజీఎం ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

ప్రమాదశాత్తు పడి మృతిచెందినట్లు తండ్రి హజారుద్దీన్ చెబుతుండగా, ప్రెగ్నెన్సీ విషయంలో ఇటీవల భార్యభర్తల మధ్య గొడవ జరిగిందని, ఈ కారణంతోనే భార్య, ఇద్దరు పిల్లలను చంపి ప్రమాదంలా చిత్రీకరిస్తున్నాడని ఫర్హాత్ తండ్రి ఎస్ కే అలీ, కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

స్విమ్మింగ్ పూల్‌లో సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ స్వాదీనం చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి విషయాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వాస్తు:ఎంత దగ్గరివారైనా సరే, ఈ 3 మొక్కలు గిఫ్ట్‌గా ఇవ్వకూడదు
వాస్తు:ఎంత దగ్గరివారైనా సరే, ఈ 3 మొక్కలు గిఫ్ట్‌గా ఇవ్వకూడదు
ప్లేయింగ్ 11లో వైభవ్‌ను చేర్చొద్దు.. మాఇజ్జత్ తీసిసారేస్తాడు
ప్లేయింగ్ 11లో వైభవ్‌ను చేర్చొద్దు.. మాఇజ్జత్ తీసిసారేస్తాడు
ఓటీటీలోకి 'పెద్ది'! కొత్త సీన్లతో కలిపి ఆరోజు నుంచే స్ట్రీమింగ్!
ఓటీటీలోకి 'పెద్ది'! కొత్త సీన్లతో కలిపి ఆరోజు నుంచే స్ట్రీమింగ్!
చుక్క నూనె లేకుండా కుక్కర్‌లో పూరీలు.. ఎలా పొంగుతున్నాయో చూస్తే
చుక్క నూనె లేకుండా కుక్కర్‌లో పూరీలు.. ఎలా పొంగుతున్నాయో చూస్తే
ఏంటీ.. ఈ చిన్నారి ఆ పాన్ ఇండియా నటి ఆ..?
ఏంటీ.. ఈ చిన్నారి ఆ పాన్ ఇండియా నటి ఆ..?
ఎరుపు రంగు మీ అదృష్టాన్ని మార్చగలదా? ఈ రంగు ఎవరికి శుభం, ఎవరికి..
ఎరుపు రంగు మీ అదృష్టాన్ని మార్చగలదా? ఈ రంగు ఎవరికి శుభం, ఎవరికి..
ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..?
ఫోన్‌కు ఒక రోజులో ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టాలో తెలుసా..?
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
'చావు అంచున ఉన్నాను.. కాపాడండి'.. టాలీవుడ్ నటి షాకింగ్ వీడియో
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!
అందమైన అమ్మాయి పాదాలతో చేసిన రొట్టె..అదంటే మగాళ్లకు పిచ్చి..!
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..
జస్ట్ 2 గంటల్లో దుబాయ్‌కి.. విమానం కంటే వేగం.. ఈ సూపర్ ట్రైన్..