AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDS రూల్స్‌ మారాయ్‌.. 15G, 15H రద్దు! కొత్తగా వచ్చిన ఫారం 121 గురించి తెలుసా?

ఏప్రిల్ 1 నుండి పాత ఫారం 15G, 15H రద్దు చేసి, ఆదాయపు పన్ను శాఖ ఫారం 121ని ప్రవేశపెట్టింది. పన్ను బాధ్యత లేనివారికి టీడీఎస్ మినహాయింపును ఇది సులభతరం చేస్తుంది. వయోభేదం లేకుండా అందరూ ఒకే ఫారం 121 ఉపయోగించవచ్చు. కొత్తగా UIN వ్యవస్థతో పారదర్శకత పెరుగుతుంది.

TDS రూల్స్‌ మారాయ్‌.. 15G, 15H రద్దు! కొత్తగా వచ్చిన ఫారం 121 గురించి తెలుసా?
Form 121
SN Pasha
|

Updated on: Apr 02, 2026 | 9:00 AM

Share

దేశంలో పన్ను విధానాన్ని సరళీకృతం చేసే దిశగా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి ఫారం 15G, 15Hలను రద్దు చేసి, వాటి స్థానంలో ఫారం 121ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మార్పు 2026-27 అసెస్‌మెంట్ ఇయర్ నుంచి అమల్లోకి వచ్చి, పన్ను బాధ్యత లేని వ్యక్తులకు నేరుగా ప్రయోజనం కలిగించనుంది. ఫారం 121 అనేది ఒకే ప్రామాణిక స్వీయ ప్రకటన పత్రంగా రూపొందించారు. ఇప్పటివరకు వయస్సు ఆధారంగా వేర్వేరు ఫారాలను సమర్పించాల్సి వచ్చేది 60 ఏళ్లలోపు వారు 15G, 60 ఏళ్లు పైబడిన వారు 15H ఉపయోగించేవారు. ఇప్పుడు ఈ భేదాన్ని తొలగించి, వయస్సుతో సంబంధం లేకుండా అందరూ ఒకే ఫారం 121ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీంతో నిబంధనలను గుర్తుంచుకోవడం, పాటించడం సులభమవుతుంది.

ఈ ఫారం ద్వారా, పన్ను బాధ్యత శూన్యంగా ఉన్న వ్యక్తులు టీడీఎస్ (TDS) మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫారం సమర్పించిన తర్వాత, బ్యాంకులు లేదా ఇతర చెల్లింపు సంస్థలు సంబంధిత ఆదాయంపై టీడీఎస్ కట్ చేయవు. బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ, పెన్షన్, పీఎఫ్ విత్‌డ్రాయల్స్, అద్దె ఆదాయం, ఇన్సూరెన్స్ కమిషన్, మ్యూచువల్ ఫండ్ ఆదాయం, డివిడెండ్లు వంటి పలు ఆదాయ వనరులు ఈ ఫారం పరిధిలోకి వస్తాయి.

కొత్త వ్యవస్థలో ప్రత్యేక గుర్తింపు సంఖ్య (UIN) కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఫారం 121 సమర్పణకు ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ జారీ చేయబడుతుంది. ఈ 26 అక్షరాల కోడ్ ద్వారా ప్రతి డిక్లరేషన్‌ను సులభంగా ట్రాక్ చేయవచ్చు. దీని వల్ల పన్ను డేటా నిర్వహణ మరింత పారదర్శకంగా మారుతుంది. బ్యాంకులు, చెల్లింపుదారులు కూడా ప్రతి ఫారం రికార్డును నిర్వహించి, త్రైమాసిక నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో టీడీఎస్ మినహాయింపు వివరాలు కూడా ఉండాలి. ఈ విధానం పర్యవేక్షణను బలోపేతం చేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us