Delhi Riots: మోదీ సర్కార్ సంచలనం.. ఆ రెండు ఛానళ్ల‌పై నిషేధం…

Modi Government: ఢిల్లీ అల్లర్లపై నిబంధనలకు విరుద్ధంగా ప్రసారాలు చేసినందుకు గానూ రెండు మలయాళ ఛానళ్లపై మోదీ సర్కార్ నిషేధం విధించింది. ఆయా ఛానళ్లపై 48 గంటల పాటు నిషేధాన్ని విధిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ రెండు ఛానళ్లు ఢిల్లీ అల్లర్లపై చేసిన రిపోర్టింగ్ రెండు వర్గాల మధ్య విద్వేషాలు పెంచేలా ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి 7.30 […]

Delhi Riots: మోదీ సర్కార్ సంచలనం.. ఆ రెండు ఛానళ్ల‌పై నిషేధం...
Follow us

| Edited By: Umakanth Rao

Updated on: Mar 07, 2020 | 2:15 PM

Modi Government: ఢిల్లీ అల్లర్లపై నిబంధనలకు విరుద్ధంగా ప్రసారాలు చేసినందుకు గానూ రెండు మలయాళ ఛానళ్లపై మోదీ సర్కార్ నిషేధం విధించింది. ఆయా ఛానళ్లపై 48 గంటల పాటు నిషేధాన్ని విధిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ రెండు ఛానళ్లు ఢిల్లీ అల్లర్లపై చేసిన రిపోర్టింగ్ రెండు వర్గాల మధ్య విద్వేషాలు పెంచేలా ఉందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి 7.30 గంటల నుంచి 48 గంటల పాటు ఆ రెండు ఛానళ్ల ప్రసారాలు నిలిచిపోనున్నాయి. కాగా, ఫిబ్రవరి 23న ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణల్లో 53 మంది మృతి చెందగా.. 200 మంది గాయపడ్డారు.

ఇక ఈ రెండు ఛానళ్లపై నిషేధాన్ని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ వ్యతిరేకించారు. ఛానళ్లపై నిషేధం విధించడం, విధించకపోవడం, సెన్సార్‌షిప్ వంటివి మంత్రిత్వ శాఖ, బ్యూరోక్రాట్లు చేయడం సరికాదని ఆయన అన్నారు. యూకే‌లోని ఆఫ్‌కామ్ మాదిరిగా ఓ స్వతంత్ర సంస్థ వీటిపై నిర్ణయం తీసుకోవడం సరైనదని తెలిపారు.

For More News:

టీవీ వీక్షకులకు గుడ్ న్యూస్..

బాన్సువాడలో దారుణం.. ముగ్గురు కూతుళ్లను హత్య చేసిన తండ్రి..

‘ఎస్ బ్యాంక్’ దెబ్బ.. వినియోగదారులకు షాకిచ్చిన ఫోన్‌పే…

ఆడబిడ్డకు జన్మనిచ్చిన దిశ నిందితుడి భార్య…

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.. నోటిఫికేషన్ విడుదల

బిగ్ బ్రేకింగ్: ఏపీలో పదో తరగతి పరీక్షలకు కొత్త షెడ్యూల్

తిరుమలలో అపచారం.. వెంకన్న సాక్షిగా వాళ్లు ఏం చేశారంటే..?

విజయ్ దేవరకొండ హీరోయిన్ ఎగ్ దోశలు.. వీడియో వైరల్..

హైపర్ ఆది సంచలన నిర్ణయం.. జబర్దస్త్ నుంచి దొరబాబు, పరదేశీలు.?

సఫారీ సిరీస్… పగ్గాలు చేపట్టనున్న హిట్‌మ్యాన్.. హార్దిక్, ధావన్‌ల రీ-ఎంట్రీ ఖరారు.!