AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాకు వ్యాక్సిన్… హైదరాబాద్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ !

ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అన్ని దేశాలు సమాయత్తమౌతున్నాయి.మన దేశంలో కూడా కరోనాకు విరుగుడు కనిపెట్టేందుకు ట్రయిల్స్ స్టార్ట్ అయ్యాయి. అదికూడా...

కరోనాకు వ్యాక్సిన్... హైదరాబాద్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ !
Jyothi Gadda
|

Updated on: Mar 07, 2020 | 2:10 PM

Share

కొవిడ్- 19: మొత్తం 89 దేశాలకు పాకింది ఈ మహమ్మారి. మన దేశంలో ఇప్పటి వరకు 31పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీన్ని అంతం చేసే మందు ఇప్పటి వరకూ రాలేదు. మున్ముందు వస్తుందేమో కానీ…ప్రస్తుతానికైతే లేదు. కేవలం నియంత్రించడం తప్ప. ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న ఈ మహమ్మారి బారిన పడి చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమౌతోంది. దీని ప్రభావంతో మదుపర్లకు సంబంధించిన లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. అందుకే ఎంత వీలైతే అంత త్వరగా దీనికి వ్యాక్సిన్ కనిపెట్టేందుకు అన్ని దేశాలు సమాయత్తమౌతున్నాయి. మన దేశంలో కూడా కరోనాకు విరుగుడు కనిపెట్టేందుకు ట్రయిల్స్ స్టార్ట్ అయ్యాయి. అదికూడా మన హైదరాబాద్‌లోనే ఇందుకు సంబంధించిన రీసెర్చ్ మొదలైనట్లు సమాచారం.

ఎబోలాకున్న లక్షణాలే కరోనాకు ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. రెండు వైరస్ లక్షణాలు ఒక్కటిగా ఉండడంతో…గతంలో కనిపెట్టిన ఎబోలా వ్యాక్సిన్‌ డేటాతో కరోనాకు మందు కనిపెట్టవచ్చని మన వైద్యులు అంటున్నారు. ఈమేరకు హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా ఇండస్ట్రీలో ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. రెమ్‌డెసీవర్‌ ఫార్మా డేటాతో కరోనాకు మందును సిద్ధం చేస్తున్నారు. ఈ పార్మా కెమికల్‌ను ఎబోలా వ్యాప్తి చెందినప్పుడు ఆఫ్రికాలో ప్రయోగించారు. ఇప్పుడు కరోనాకు ఇదే డేటా సరిపోతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈమేరకు గిలియడ్ సైన్సెస్‌ అనే కంపెనీ 15మంది శాస్త్రవేత్తల బృందంతో కలిసి కరోనాకు ఔషధాన్ని తయారు చేసే పనిలో ఉంది.

మన హైదరాబాద్‌కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కరోనాకు మందు కనిపెట్టే పనిలో బిజీగా ఉంది. ఎబోలా యాంటీవైరల్ డ్రగ్ పద్దతిలో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం 10 నుంచి 50గ్రాముల మందును తయారు చేసి ఉంచుతామని,…మెడికల్ ట్రయల్స్‌లో సక్సెస్ అయితే…బల్క్‌గా విడుదల చేస్తామని ఐఐసీటీ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపినట్లు సమాచారం. ఇక అన్నీ పరీక్షలు పూర్తై, ఒకసారి మెడిసిన్ వచ్చిందంటే..చైనాను వణికించిన వైరస్‌కు హైదరాబాద్‌లో ఔషదం తయారైనట్లే.

Follow Us
గుడ్‌న్యూస్‌.. విమానంలో 60 శాతం సీట్లు ఉచితం!
గుడ్‌న్యూస్‌.. విమానంలో 60 శాతం సీట్లు ఉచితం!
ఆఫీసులో మిమ్మల్ని వీక్ అనిపించే 5 అలవాట్లు! వెంటనే మానుకోండి
ఆఫీసులో మిమ్మల్ని వీక్ అనిపించే 5 అలవాట్లు! వెంటనే మానుకోండి
నో టెన్షన్.. యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం..
నో టెన్షన్.. యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం..
సముద్రంలో బయటపడ్డ 700ఏళ్లనాటి యుద్ధనౌక..! దాని నిండా ఇప్పటికీ
సముద్రంలో బయటపడ్డ 700ఏళ్లనాటి యుద్ధనౌక..! దాని నిండా ఇప్పటికీ
చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. గాయపడిన మరో డేంజరస్ ప్లేయర్
చెన్నై ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. గాయపడిన మరో డేంజరస్ ప్లేయర్
కేతువు సంచారం ప్రభావం: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభయోగాలు..
కేతువు సంచారం ప్రభావం: ఈ రాశుల వారికి ఆర్థిక లాభాలు, శుభయోగాలు..
దోమలు కొందరినే ఎందుకు కుడుతాయో తెలుసా..?
దోమలు కొందరినే ఎందుకు కుడుతాయో తెలుసా..?
ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్‌.. ఈ తప్పులు అస్సలు చేయకండి!
ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్‌.. ఈ తప్పులు అస్సలు చేయకండి!
AI: కోడింగ్ అవసరం లేకుండా ఫ్రీ AI కోర్సులు - ఇప్పుడే నేర్చుకోండి!
AI: కోడింగ్ అవసరం లేకుండా ఫ్రీ AI కోర్సులు - ఇప్పుడే నేర్చుకోండి!
రైల్వే టికెట్లకు కొత్త క్యాన్సిలేషన్ రూల్స్.. ఏప్రిల్ 1 నుంచే..
రైల్వే టికెట్లకు కొత్త క్యాన్సిలేషన్ రూల్స్.. ఏప్రిల్ 1 నుంచే..