జగిత్యాల జిల్లా యాసిడ్ దాడిపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. నేరస్థులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

జగిత్యాల జిల్లాలో యువతిపై జరిగిన యాసిడ్ దాడిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. మహిళపై దాడి బాధాకరమని నిందితులు ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు.

జగిత్యాల జిల్లా యాసిడ్ దాడిపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. నేరస్థులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 23, 2020 | 11:01 PM

MLC kavita reacts: జగిత్యాల జిల్లాలో యువతిపై జరిగిన యాసిడ్ దాడిపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. మహిళపై దాడి బాధాకరమని, నిందితులు ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. అయితే నేరస్తులు తప్పించుకోలేరని, ఈ విషయమై వేగంగా విచారణ జరిగేలా చూడాలని జగిత్యాల జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కోరినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి తన ట్విట్టర్ ఖాతా వేదికగా ఆమె వెల్లడించారు. ‘‘యాసిడ్ దాడి గురించి చాలా బాధపడ్డాను. వేగంగా విచారణ జరిపించాలని జగిత్యాల ఎస్పీతో మాట్లాడాను. ఎంత న్యాయమైన సరే యువతి గాయాన్ని మాన్పలేదు, దు:ఖాన్ని తగ్గించలేదు. అయితే నేరస్థులను మాత్రం చట్టం పరిధిలోకి తీసుకురావచ్చు’’ అని కవిత ట్వీట్ చేశారు. ఇదిలావుండగా జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో మండలం తిమ్మాపూర్‌లో తండాలో బస్టాండ్ నుంచి ఇంటికి వెళ్తున్న యువతిపై ఓ దుండగుడు యాసిడ్‌తో దాడి చేశాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం మెట్‌పల్లిలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.