జమ్ము కశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కమల వికాసం.. అధిపత్యం మాదేనంటున్న గుప్కార్
జమ్ము కశ్మీర్ జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికల ఫలితాల్లో గుప్కార్ కూటమికి ఆధిక్యత సాధించింది. 110 సీట్లు సాధించిన గుప్కార్ కూటమి మొత్తం 13 జిల్లాల్లో ఆధిపత్యం కొనసాగిచింది. బీజేపీ పార్టీ సొంతంగా 74 సీట్లలో విజయం సాధించి ఆరు జిల్లాలను సొంతం చేసుకుంది.
JK DDC election results: ప్రతిష్టాత్మకమైన జమ్ముకశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదని అటు గుప్కార్ కూటమి, ఇటు బీజేపీ వాదిస్తోంది. జమ్ము కశ్మీర్ జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికల ఫలితాల్లో గుప్కార్ కూటమికి ఆధిక్యత సాధించింది. 110 సీట్లు సాధించిన గుప్కార్ కూటమి మొత్తం 13 జిల్లాల్లో ఆధిపత్యం కొనసాగిచింది. బీజేపీ పార్టీ సొంతంగా 74 సీట్లలో విజయం సాధించి ఆరు జిల్లాలను సొంతం చేసుకుంది. జమ్మూ ప్రాంతంలో బీజేపీ తన హవా కొనసాగింంది. కశ్మీర్ స్థానిక సంస్థల్లో బీజేపీ విజయం వేర్పాటువాదులకు ఇది గుణపాఠమని కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్ అన్నారు. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడం శుభపరిమాణమని అన్నారు. అటు, ఏడు పార్టీలతో కూటమిగా ఏర్పడ్డ గుప్కార్.. కశ్మీర్‌లో తన ప్రాబల్యాన్ని ప్రదర్శించింది.
గత ఏడాది కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కశ్మీర్‌లో తొలిసారిగా డీడీసీ ఎన్నికలు నిర్వహించారు. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 19 వరకు ఎనిమిది దశల్లో ఎన్నికలు జరిగాయి. 20 జిల్లాల్లోని 280 డీడీసీ నియోజకవర్గాలకు పోలింగ్ చేపట్టారు. డీడీసీ ఎన్నికల్లో అత్యధికంగా బీజేపీకి 74 సీట్లు దక్కాయి. ఇక, ఆ తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ 67, ఇండిపెండెంట్ 49, జమ్మూకశ్మీర్ పీడీపీ 27, కాంగ్రెస్ 26, అప్నీ పార్టీ 12 స్థానాలను కైవసం చేసుకున్నాయి. డీడీసీ ఎన్నికల్లో బీజేపీకి పోలైన ఓట్ల శాతం అధికంగా ఉన్నట్లు ఎన్నికల డేటా చెబుతున్నది. కశ్మీర్‌లో ఫారూక్ అబ్దుల్లా నేతృత్వంలోని గుప్కార్ కూటమికి 72 సీట్లు దక్కాయి. అక్కడ బీజేపీ కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకున్నది. శ్రీనగర్ జిల్లా ఫలితం మాత్రం ఇంకా డోలాయమానంలో ఉన్నది. ఆ జిల్లాలో ఇండిపెండెంట్ల హవా నడుస్తున్నది. ఇక జమ్మూ ప్రావిన్సులో బీజేపీ 71 సీట్లు గెలుచుకున్నది. జమ్మూ, ఉదమ్‌పూర్, సాంబా, కథువా, రీసాయి, దోడా ప్రాంతాల్లో బీజేపీ 71 సీట్లు కైవసం చేసకున్నది. కశ్మీర్‌లో బీజేపీ తొలిసారి మూడు సీట్లను గెలుచుకుంది. ఇది మార్పుకు సంకేతం అని ఆ పార్టీ చెబుతుంది. ఎన్‌సీ, పీడీపీలపై ఆ పార్టీ గెలవడం గమనార్హం.